కమలం పార్టీ బీజేపీ మరోమారు కేంద్రంలో జెండా పాతేసింది. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దాని కంటే కూడా కాస్తంత ఘనమైన విక్టరీనే నమోదు చేసిన బీజేపీ... మరోమారు నరేంద్రమోదీని ప్రధాన మంత్రిని చేచేసేస్తోంది. ఈ నెల 30న రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్ లో మోదీ పీఎంగా ప్రమాణం చేయనున్నారు. మోదీ వరకు ఓకే గానీ... మరి ఆయన అనుంగు మిత్రుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు వినిపిస్తున్న అసలు సిసలు ప్రశ్న.
మొన్నటిదాకా లోక్ సభలో మెంబర్ గా లేని షా... పూర్తిగా పార్టీ వ్యవహారాల్లోనే నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో మోదీ పీఎంగా ఉన్నప్పటికీ ఆయన కేబినెట్ లో మినిస్ట్రీ కోసం అమిత్ షా ఆశగా ఎదురు చూడాల్సిన పరిస్థితి రాలేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు పరిస్థితి వేరు కదా. ఏకంగా పార్టీ సీనియర్ మోస్ట్ నేత ఎల్కే అద్వానీని పక్కనపెట్టేసి మరీ గాంధీ నగర్ లోక్ సభ నుంచి పోటీ చేసిన అమిత్ షా... బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. ఈ క్రమంలో కొత్తగా కొలువుదీరనున్న మోదీ కేబినెట్ లో అమిత్ షాకు కీలక శాఖ దక్కుతుందన్న భావన కలుగుతుంది కదా. నిన్నటిదాకా కేంద్ర హోం మంత్రిగా ఉన్న రాజ్ నాథ్ సింగ్ కు వేరే శాఖ పగ్గాలు అప్పజెప్పి... ఆ శాఖను అమిత్ షాకు అప్పగించడం ద్వారా ఆయనకు ఓ మోస్తరు ప్రాధాన్యం కల్పిస్తారన్న భావన కూడా వ్యక్తమైంది.
అయితే తాజాగా వినిపిస్తున్న వార్త ల ప్రకారం అమిత్ షాకు అసలు కేబినెట్ లోనే చోటు దక్కడం లేదట. 30న పీఎంగా ప్రమాణం చేయనున్న మోదీ... అమిత్ షాను మాత్రం తన కేబినెట్ లోకి తీసుకోవడం లేదట. మోదీ లెక్కలేమిటో తెలియదు గానీ... ఈ సారి కూడా అమిత్ షాకు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కడం లేదన్న మాట అయితే పక్కా అనే విశ్లషణలు వినిపిస్తున్నాయి. అయినా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షాకు సెంట్రల్ మినిస్ట్రీ తగినది కాదని కూడా ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారట. కేంద్ర మంత్రి పదవే అమిత్ షాకు సరితూగకుంటే... అంతకుమించిన పోస్టు ఇక ప్రధాన మంత్రే కదా. దానిలో మోదీ ఉండిపాయే... మరి అమిత్ షాకు ఇంకేం పదవి ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది.