భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్ ఇటీవల అత్యాచార ఆరోపణల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే... ఆ ఆరోపణలన్నీ అవాస్తవాలేనని తేలంది. సర్దార్ తనపై అత్యాచారయత్నం చేశాడని అతని చిరకాల స్నేహితురాలు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) తేల్చడంతో సర్దార్ ఊపిరి పీల్చుకున్నాడు. ఫిర్యాదు చేసిన యువతితో సర్దార్ ఓ రాత్రి గడిపాడంటూ వచ్చిన ఆరోపణలు కూడా నిజం కాదని తేలింది.
కాగా ఆరోపణలు చేసిన యువతి ఇంగ్లండ్ లో హాకీ క్రీడాకారిణి. ఆమె ఓ రాత్రి సర్దార్ ను కలవడానికి వెళ్లగా అత్యాచారం చేశాడంటూ లూథియానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఫిర్యాదు చేసిన తరువాత ఆమె అట్నుంచి అటే లండన్ వెళ్లిపోయింది. ఈ ఫిర్యాదుపై విచారణ చేసిన పోలీసులు సర్దార్ నిర్దోషని తేల్చారు. సర్దార్, తాను ప్రేమించుకున్నామని, అతనికి కాబోయే భార్యనని భారత సంతతికి చెందిన బ్రిటన్ అమ్మాయి గతంలో వెల్లడించింది. కొన్ని నెలల కిందట భారత్ కు వచ్చిన ఆమె.. సర్దార్ వేధిస్తున్నాడని గత ఫిబ్రవరి 1న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె తనకు తెలుసు కానీ ఆమెను ఏమీ చేయలేదని సర్దార్ మొదటి నుంచి చెబుతున్నారు.
దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారించారు. ఆ విచారణలో ఆమె చేసిన ఫిర్యాదులో విషయాలన్నీ తప్పులేనని తేలింది. సర్దార్ నిర్దోషని నిరూపణ అయింది. దీంతో మన హాకీ కెప్టెన్ మైదానం బయట చేసిన ఈ నిర్దోషిత్వ పోరులో గెలిచినట్లయింది.