పీకే టీం లీడర్స్ చేతులు ఎత్తేశారా...?

Update: 2022-11-09 14:30 GMT
వైసీపీ కోసం పీకే టీం పనిచేస్తున్న సంగతి తెలిసిందే. వారే ఇపుడు పార్టీకి దిక్చూచిగా ఉంటున్నారు. వారే కళ్ళూ ముక్కూ చెవులుగా చేసుకుని వైసీపీ అధినాయకత్వం గ్రౌండ్  లెవెల్ రియాల్టీస్ ని ఎప్పటికపుడు తెలుసుకుంటోంది. అయితే పీకే టీం ఇస్తున్న సర్వే నివేదికలు అధినాయకత్వానికి  చేదు నిజాలను ఎప్పటికపుడు తెలియచేస్తున్నాయి.

వైసీపీకి అంతకంతకు పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను పీకే టీం కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తోంది. దాంతో ఒక  వైపు చూస్తే నిబ్బరం చెదురుతోంది. ధీమా స్థానంలో దిగులు కూడా ఆవహిస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే పీకే టీం కూడా ఇపుడు చేతులు ఎత్తేసే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు.

ఎలా ఉంది అంటే పీకే టీం 2019 ఎన్నికలో స్ట్రాంగ్ గా నిలబడింది. కావాల్సిన అండదండలు అన్నీ కూడా వైసీపీ క్యాడర్ అందిస్తూ వచ్చింది. నాటి ఉత్సాహం ప్రోత్సాహం వేరుగా ఉండేది. ఇపుడు చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయింది. దాంతో పీకే టీం కూడా వైసీపీ క్యాడర్ నుంచి తగిన సహకారం అందకపోవడంతో బయట నుంచి టీం మెంబర్స్ ని రిక్రూట్ చేసుకుంటోందిట.

అలా నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలలో పీకే టీం కి ఇంచార్జిగా ఒక మహిళను నియమించరట. ఇక రాజకీయంగా చూస్తే ఆమెకు ఏమీ తెలియదు అని అంటున్నారు. ఇలా ఏదో యూనివర్శిటీ నుంచి డిగ్రీ చేసినవాళ్ళను ఎంచుకుని మరీ  పీకే టీం ఇపుడు రిక్రూట్ చేసుకుంటోందిట.

ఈ పరిస్థితులలో వైసీపీ క్యాడర్ నుంచి పీకే టీం కి ఫోన్ చేసినా ఆ మహిళ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడంలేదుట. ఆమె మాత్రమే కాదు ఇలా కొత్తగా రిక్రూట్ అయిన వారు కూడా ఏమీ పెద్దగా పనిచేయడంలేదు అని అంటున్నారు. అంటే ఏదో  మొక్కుబడిగా తూతూమంత్రంగానే గ్రౌండ్ లెవెల్ లో పీకే టీం యాక్టివిటీస్ జరుగుతున్నాయా అన్న చర్చ అయితే బయల్దేరింది.

మరి అదే అసలైన నివేదికలుగా, పక్కా నిక్కచ్చి సర్వేలుగా భావించి హై కమాండ్ ముందుకు వెళ్తే ఎంతవరకూ కరెక్ట్ అని అంటున్నారు. నిజానికి పీకే టీం గతంలో చేసిన ప్రతీ సర్వేకూ ఒక పద్ధతి విధానం ఉండేది. అవి చాలా మటుకు నిజాలే అయ్యేవి. కానీ ఇపుడు టీం పేరిట ఎవరిని పడితే వారిని రిక్రూట్ చేసుకుని కధ నడిపిస్తూంటేనే రాజకీయంగా తేడాలు వచ్చేస్తున్నాయని అంటున్నారు.

మరి పీకే టీం నే ముందు పెట్టుకుని వారు ఇచ్చిన సమాచారమే తమకు అతి పవిత్రమని భావించడం వల్ల హై కమాండ్ కి వాస్తవాలు తెలుస్తాయా అన్న డౌట్లు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. మరి ఎంతో డబ్బు ఇచ్చి పీకే   టీం ని జనాల్లో తిప్పుతూంటే వారు తమ టీం మెంబర్స్ ని ఇలా ఎందుకు సెలెక్షన్ చేసుకుంటున్నారు అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది.

అంటే వారిలో కూడా గత ఉత్సహాం సన్నగిల్లిందా లేక ఎక్కడికి వెళ్ళినా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి రొటీన్ గానే సర్వేలు చేసి నివేదికలు పంపిస్తే సరిపోతుందని భావిస్తున్నారా అన్నదే సందేహంగా ఉంది అంటున్నారు

ఏది ఏమైనా ఇలా నాసిరకంగా కనుక పీకే టీం మెంబర్స్ యాక్టివిటీస్ ఉంటే కనుక ఆ విషయంలో అలెర్ట్ కావాల్సింది అధినాయకత్వమే అని అంటున్నారు. మొత్తానికి చూస్తే పీకే టీం సైతం ఇపుడు చేతులెత్తేసినట్లే ఉందని అంతా చర్చించుకోవడం విశేషం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News