కరోనా వైరస్ మరింత ప్రమాదకారిగా మారబోతుందా అనే ప్రశ్నకు సమాధానం అవును అనే వినిపిస్తుంది. మొదటగా కోవిడ్ పేరుతో ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన ఈ వైరస్ తదనంతరం కాలంలో రూపు మార్చుకుని కొత్త వేరియంట్ గా అవతరించింది. ఆ వేరియంట్లు సాయంతో ప్రపంచంలోని అనేక దేశాల్లో మరణమృదంగం కొనసాగించింది. ఇప్పటికీ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పేరుతో ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి దేశాలు ఈ కొత్త వేరియంట్ ధాటికి నిలవలేక పోతున్నాయి. ఈ దేశాల్లో వైరస్ కేసులు పెద్ద మొత్తంలో వెలుగుచూస్తున్నాయి. ఇదిలా ఉంటే గతంలో వచ్చిన అంటే చాలా ప్రమాదకారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే చైనాకు చెందిన ఓ పరిశోధకుల బృందం వైరస్ కు సంబంధించిన లక్షణాలపై కీలక పరిశోధనలు చేపట్టింది. ఇందులో ఆశ్చర్య పోయే నిజాలు వెలుగు చూశాయి. వీరు గుర్తించిన శాంపిల్స్ లో చాలా వరకూ కరోనా లక్షణాలు లేవని స్పష్టమయింది. కానీ వీరిలో అందరూ వైరస్ బారిన పడిన వాళ్లే అని పేర్కొంది. వివిధ దేశాలకు సంబంధించిన ప్రజల నుంచి శాంపిళ్లను సేకరించి ఈ పరిశోధన చేపట్టినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
ముఖ్యంగా అమెరికా, ఆఫ్రికా, ఆసియా ఖండంలో ఉండే ప్రజల్లో వైరస్ కు సంబంధించిన లక్షణాలు ఏమీ కనిపించడం లేదని పరిశోధకులు చెప్పారు. అయితే వైరస్ ఆనవాళ్ళు వ్యక్తిలో గుర్తించకపోవడం సామాజిక వ్యాప్తికి దారి తీస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా కరోనా వైరస్ బారిన పడితే ఎవరికైనా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇదంతా కరోనా తొలినాళ్ళలో మాత్రమే జరిగింది. వైరస్ సోకిన వారిలో ఎక్కువ మంది కి జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరం లాంటివి ఎక్కువగా వచ్చేవి. తద్వారా బాడీలో ఉండే వ్యాధి నిరోధక శక్తి అంతకంతకు తగ్గిపోయి.. చివరకు మనిషి మరణించే స్థాయికి చేరుకుంటాడు. ఈ క్రమంలోనే బాధితుడు సరిగా ఊపిరి కూడా పీల్చుకోలేని స్థితికి చేరుకుంటాడు. చివరి దశలో చనిపోతారు.
పైన పేర్కొనబడిన లక్షణాలేవి కొత్తగా వైరస్ సోకిన వారిలో కనిపించడంలేదని చైనాకు చెందిన శాస్త్రవేత్తల బృందం తెలిపింది. కరోనా బారిన పడిన వారిలో సుమారు 40 శాతం మందికి పైగా లక్షణాలు వెలుగు చూడటం లేదని ఈ బృందం చెప్పుకొచ్చింది. ప్రాథమికంగా ఈ లక్షణాలు బయట పడకపోవడంతో చాలామంది వైరస్ కు సంబంధించిన పరీక్ష చేయించుకోవడం లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకి సామాజిక వ్యాప్తికి దారితీస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇదే జరిగితే కేసుల సంఖ్య ఆయా దేశాల్లో అమాంతంగా పెరిగిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే జరిగిన 95 శాతం అధ్యయనాల్లో ఈ విషయం బయట పడినట్లు చైనా శాస్త్రవేత్తలు చెప్పారు.
వైరస్ బారిన పడిన సుమారు మూడు కోట్ల మందికి పైగా శాంపిళ్లను పరిశీలించిన తరువాత ఈ విషయం అర్ధమైనట్లు పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా యువతలో వైరస్ ఆనవాళ్లు కనిపించడం లేదని పేర్కొన్నారు. అంతేకాకుండా 60 ఏళ్లు పైబడిన వారిలో కూడా వైరస్ ఆనవాళ్ళు స్పష్టంగా తెలియడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఎక్కువ శాతం కేసులు అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే వెలుగు చూస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. అమెరికా , ఐరోపా లాంటి దేశాల్లో వైరస్ బారిన పడిన వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉందని స్పష్టమైంది.
కరోనా సోకినవారిలో వైరస్ ఆనవాళ్ళు కనిపించకపోవడం పై వైద్య అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సామాజిక వ్యాప్తిగా మారితే కట్టడి చేయడం కష్టమని పేర్కొన్నారు. ఆయా దేశాలు పరీక్షల సంఖ్యను పెంచడంతో పాటు వ్యాక్సినేషన్ కూడా పెద్ద ఎత్తున చేపట్టాలని పిలుపునిచ్చారు. డబ్ల్యుహెచ్వో ఇచ్చిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని సూచించారు. జలుబు, దగ్గు, ఆయాసం, జ్వరం లాంటివి కనిపించిన వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవడం ద్వారా వైరస్ను అరికట్టేందుకు ఆస్కారం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇలా చేయడం ద్వారా సామాజిక వ్యాప్తిని కొంతమేరకైనా తగ్గించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.