ట్వీట్ల‌తో తాట తీసే ఆ సీఎం ఇప్పుడెక్క‌డ‌?

Update: 2017-07-16 08:40 GMT
దేశంలో చాలామంది ముఖ్య‌మంత్రులున్నా.. దేశ ప్ర‌జ‌ల‌కు.. ఆ మాట‌కు వ‌స్తే మీడియాకూ ఢిల్లీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ అంటే అదోర‌క‌మైన క్రేజ్‌. మిగిలిన రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో పోలిస్తే.. క్రేజీవాల్ చేసే వ్యాఖ్య‌ల మీద ఒకింత ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తుంటారు. ఇలాంటి క్రేజ్ ఉన్న ముఖ్య‌మంత్రుల్లో ఆయ‌న అగ్ర‌భాగాన నిలుస్తారు. దీనికి త‌గ్గ‌ట్లే నిత్యం ఏదో అంశం మీద కేజ్రీవాల్ మాట్లాడి వార్త‌ల హెడ్ లైన్స్ లో ఉంటారు.

ప్ర‌జ‌లు ఇచ్చిన అధికారంతో ఢిల్లీ రాష్ట్రాన్ని త‌న‌దైన మార్క్ తో మార్చేయాల్సింది పోయి.. నిత్యం జాతీయ రాజ‌కీయాల మీద‌నే కేజ్రీవాల్ దృష్టి పెడ‌తార‌న్న పేరు ఉంది. ట్విట్ట‌ర్ ను ఆయుధంగా చేసుకొని నిత్యం బీజేపీ అండ్ కో మీద దునుమానే కేజ్రీవాల్ కొద్ది రోజులుగా కామ్ గా ఉన్న సంగ‌తి త‌ర‌చి చూసినంత‌నే గుర్తుకు వ‌స్తుంది.

గ‌డిచిన‌కొద్ది వారాలుగా కేజ్రీవాల్ గొంతు విప్ప‌టం లేదు.. ట్విట్ట‌ర్లో ట్వీట్ చేయ‌టం లేదు. అలా అని అస్స‌లు మాట్లాడ‌కుండా ఉండ‌టం.. ట్వీట్లు చేయ‌కుండా ఉంటున్నార‌ని చెప్ప‌టం ఇక్క‌డ ఉద్దేశం కాదు. ఢిల్లీ రాష్ట్రం.. ఢిల్లీ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల మీద త‌ప్పించి మ‌రింకే అంశాల మీదా త‌న‌కు ఆస‌క్తి లేద‌న్న‌ట్లుగా ఆయ‌న తీరు ఇప్పుడు క‌నిపిస్తోంది.

ఉన్న‌ట్లుండి కేజ్రీవాల్ ఎందుక‌లా మారిపోయిన‌ట్లు? అన్న‌ది ప్ర‌శ్న‌. దీనికి స‌మాధానం వెతికే ప్ర‌య‌త్నం చేస్తే.. ఇటీవ‌ల కాలంలో ఆయ‌నలో వ‌చ్చిన మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు. గ‌తంలో మాదిరి జాతీయ రాజ‌కీయాల గురించి మాట్లాడటం పూర్తిగా మానేసిన కేజ్రీవాల్‌.. ఇప్పుడు త‌న ఫోక‌స్ అంతా రాష్ట్రం మీద‌నే పెడుతున్న‌ట్లుగా చెబుతున్నారు. నిత్యం రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌టం.. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావటం.. అభివృద్ధి కార్య‌క్ర‌మాల మీద ఫోక‌స్ చేయ‌టం లాంటివి చేస్తున్నారు.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల మీద ఎన్నో ఆశ‌లు పెట్టుకుంటే.. అక్క‌డి ఓట‌ర్లు ఇచ్చిన షాక్ కేజ్రీవాల్ కు క‌ళ్లు తెరిచేలా చేసింద‌ని చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే.. పంజాబ్ రాష్ట్ర ఎన్నిక‌ల త‌ర్వాత నుంచి ఆయ‌న‌లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అంతేనా.. పంజాబ్ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత నుంచి మీడియాను దూరంగా ఉంచేస్తున్న కేజ్రీవాల్‌.. త‌న ప‌ని తాను అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారే త‌ప్పించి.. మిగిలిన అంశాల జోలికి వెళ్ల‌టం లేదు. పూర్తిగా ఢిల్లీ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు.. ఢిల్లీ పాల‌న మీద‌నే కేజ్రీవాల్ దృష్టి పెట్టిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. మొద‌ట్నించి అదే ప‌ని చేసి ఉంటే.. ఢిల్లీ రాష్ట్రంలో తిరుగులేని రాజ‌కీయ నేత‌గా మార‌టంతో పాటు.. ఢిల్లీ అభివృద్ధి మోడీ స‌ర్కారుకు మంట పుట్టించేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.కాస్త ఆల‌స్యంగా అయినా తానేం చేయాల‌న్న విష‌యంలో కేజ్రీవాల్ స‌రైన దారిలోనే ప్ర‌యాణిస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News