పక్క ప్రజల మనుసుల్ని దోచుకునేలా నిర్ణయాలు తీసుకోవటమే కాదు.. వాయు వేగంతో నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ పుణ్యమా అని పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలోని కేసీఆర్ సర్కారుకు ఇప్పుడు కనిపించని మంట మొదలైంది. జగన్ పాలన అంటే ఏమో అనుకున్నాం కానీ.. దీన్ని అస్సలు ఊహించలేదన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది. ఎన్నికల్లో పోలింగ్ రోజు నుంచే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమాను జగన్ ప్రదర్శించారు.
అంతేకాదు.. కొత్త ప్రభుత్వం ఎలా ఉండాలన్న అంశంపైనా ఆయన కసరత్తు చేశారు. గెలుపు వార్త వినగాడే.. హడావుడి హంగామా చేయకుండా ప్రభుత్వం ఏం చేయాలి? ఏం చేయకూడదన్న విషయం మీద దృష్టి సారించారు. వరుస పెట్టి నిర్ణయాలు తీసుకుంటూ సంచలనంగా మారారు.
ఇలాంటివేళ.. విపక్ష నేతగా వ్యవహరించాల్సిన చంద్రబాబు తన తీరును పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. విపక్ష నేతగా ఆయనకు అలవాటైన పాత్రను కొత్త తరహాలో పోషించాల్సి ఉంది. పుల్లీ లోడెడ్ గన్ మాదిరి ఉంటే వ్యవహరిస్తున్న జగన్ ను ఢీ కొనాలంటే పాత బాబు అస్సలు సరిపోరు.
తన తీరును మార్చుకోవటంతో పాటు.. తన వెర్షన్ ను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడిదాకానో ఎందుకు పార్టీ పరంగా చూస్తే.. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి తమపార్టీ కార్యకర్తల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయని అదేపనిగా ఆరోపిస్తున్నారు బాబు. ఇలాంటివేళ.. దాడుల లెక్కను చెప్పాల్సిన అవసరం ఉంది. దాడులు జరుగుతున్నాయని చెప్పే బాబు.. కష్టం కలిగిన కార్యకర్తల్ని ఓదార్చాల్సిన అవసరం ఉంది. అండగా ఉన్నామన్న అభయం ఇవ్వాల్సి ఉంది.
అందుకు భిన్నంగా దాడులు జరుగుతున్నాయని చెబుతూ కాలం గడిపేస్తున్నారు. తాజాగా సమావేశమైన పార్టీ.. కార్యకర్తల దాడుల వివరాలు సేకరించేందుకు.. ఏదైనా సమస్య వచ్చిన పక్షంలో.. వారి ఆవేదనను తెలియజేసేందుకు టోల్ ఫ్రీ ఏర్పాటు చేయాలన్న తీర్మానం చేసినట్లుగా బాబు చెబుతున్నారు. ఒక పార్టీకి టోల్ ఫ్రీ ఏర్పాటు పెద్ద విషయం కాదు. ఆ చిన్న విషయానికి నిర్ణయం తీసుకోవటం..ఆ వెంటనే అమలు చేయటం చేయాల్సింది పోయి.. అదో పెద్ద నిర్ణయంగా పేర్కొంటూ.. తీర్మానం చేశామని చెప్పుకోవటం చూస్తే.. మాటలతో కాలం గడిపే ప్రోగ్రాం నుంచి బాబు బయటకు రారా? అన్న భావన కలుగక మానదు.