అమెరికాకు మరిన్ని అణు గిఫ్టులు: ఉత్తర కొరియా

Update: 2017-09-06 04:24 GMT
అణు పరీక్షలతో గడగడలాడిస్తున్న ఉత్తర కొరియా తన తీరుపై ప్రపంచ దేశాలు వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నా ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు.

రెండు రోజుల కిందట హైడ్రోజన్‌ బాంబును ప్రయోగించడంతో ఉత్తరకొరియాను అమెరికా తీవ్రంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో ఉత్తర కొరియా మరింత రెచ్చిపోతూ  అమెరికాకు మరిన్ని గిఫ్ట్‌ ప్యాకేజీలు పంపుతామంటూ ప్రకటించడం అగ్రరాజ్యాన్ని కలవరపెడుతోంది.
    
స్విట్జర్లాండ్‌ లోని జెనీవాలో జరిగిన ఓ సమాశంలో ఉత్తర కొరియా రాయబారి హాన్ టే సాంగ్ .. '' రెండు రోజుల క్రితమే హైడ్రోజన్ బాంబు పరీక్షించాం... మా దేశ ర‌క్ష‌ణ కోసం పరీక్షించిన ఈ హైడ్రోజ‌న్ బాంబు 'ఓ గిప్ట్ ప్యాకేజ్'' అంటూ ఇలాంటి మరిన్ని గిఫ్ట్ ప్యాకేజీలు అందుకోవడానికి అమెరికా సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. తమను కంట్రోల్ చేయడానికి అమెరికా రెచ్చగొట్టే పనులు - వ్యాఖ్యలు మానుకోనంత వరకు తాము పరీక్ష‌లు చేస్తూనే ఉంటామ‌ని వార్నింగ్ ఇచ్చారు.
    
కాగా ఉత్తర కొరియాకు అణు సాంకేతికత పాకిస్థాన్ నుంచి అందుతోందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పాక్ అణు పితామహుడు అబ్దుల్ ఖదీర్ ఖాన్ స్పందించారు.  ఉత్తర కొరియా దగ్గర ఉన్న అణు సాంకేతికత తమ కంటే శక్తిమంతమైనదని ఆయన అన్నారు. ఉత్తర కొరియా హైడ్రోజన్‌ బాంబు పరీక్షలో ఉత్తర కొరియాకు పాకిస్తాన్ ఎలాంటి సాయం చేయలేదని ఖాన్ స్పష్టం చేశారు.
Tags:    

Similar News