డొనాల్డ్ ట్రంప్...అగ్రరాజ్యం అమెరికా అధిపతి తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ పలు దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. అయితే అలాంటి వ్యక్తికి చుక్కలు చూపిస్తున్నాడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర కొరియా క్షిపణి ప్రయోతంగా దీన్ని నిరూపించింది. ఉత్తర్ కొరియా అధికార పత్రిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ఆసక్తికరమైన నిజాలను వెల్లడించింది. తాము తాజాగా ప్రయోగించిన మిస్సైల్స్ లక్ష్యం జపాన్ లోని అమెరికా స్థావరాలే అని ప్రకటించి సంచలనం సృష్టించింది. ఈ తాజా క్షిపణి పరీక్షలు అధ్యక్షుడు కింగ్ జాంగ్ ఉన్ సమక్షంలోనే జరిగినట్లు తేల్చిచెప్పింది.
సోమవారం ఉదయం నాలుగు బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించిన విషయం తెలిసిందే. ఇందులో మూడు జపాన్ ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ జోన్ లో పడ్డాయి. నిజానికి ఈ క్షిపణులను అక్కడున్న అమెరికా స్థావరాలే లక్ష్యంగా ప్రయోగించారని ఆ పత్రిక చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ లో ఎన్నో మిలిటరీ స్థావరాలను అమెరికా ఏర్పాటు చేసుకుంది. అందులో తాజాగా మిస్సైల్ పడిన స్థావరం ఒకటి. తమ దేశం ఈ క్షిపణి ప్రయోగాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నట్లు అమెరికా తెలిపింది.
అయితే ఈ ప్రయోగంలో ఎలాంటి మిస్సైల్స్ ను ఉపయోగించారో మాత్రం ఉత్తర కొరియా వెల్లడించలేదు. నిజానికి నార్త్ కొరియా ఎలాంటి క్షిపణులను ప్రయోగించకుండా ఐక్య రాజ్య సమితి ఆంక్షలు విధించింది. అటు అమెరికా కూడా ఈ పరీక్షలపై గుర్రుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా స్థావరాలే తమ లక్ష్యమని నార్త్ కొరియా ప్రకటించడం ఉద్రిక్తతలను మరింత పెంచే ప్రమాదం కనిపిస్తున్నది. ఈ మిస్సైల్స్ ప్రయోగం తర్వాత తమ రక్షణ బలగాలను అలెర్ట్‌గా ఉండాలని కిమ్ జాంగ్ ఆదేశించడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడైనా యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని, అందుకు పూర్తి సిద్ధంగా ఉండాలని సూచించారు.ఉత్తర కొరియా బెదిరింపులు కొత్త ఎత్తుకు చేరాయని జపాన్ ప్రధాని షింజో అబె అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/