ఒకప్పుడు పెళ్లి ఒక పవిత్రబంధంగా ఆరురోజుల పాటు జరిపించేవారు. ఇప్పుడు అరరోజుకు పరిమితం చేశారు. అకాశమంత పందిళ్లు కనిపించడం లేదు. పెళ్లికొడుకు, పెళ్లికూతురు బంధువులు అంతా కలిసి ఇరువురు ఒకే చోట ఏదో ఒక ఫంక్షన్‌హాల్‌లో పెళ్లిళ్లను అరరోజులోనే పూర్తి చేస్తున్నారు. గతంలో పెళ్లి ఉందంటే బంధుమిత్రులందరూ కలిసి వారం రోజుల పాటు ఇంట్లో సందడి చేస్తూ అందరు కలిసి వంటలు చేయడం, వంట వాళ్లు వస్తే వారికి సహాయం చేయడం జరిగేది. కానీ ఇప్పుడు అంతా క్యాటరింగ్ పద్ధతే వచ్చింది.
' స్టేటస్ సింబల్‌గా వేడుకలు
చివరకు సాంప్రదాయ బద్దంగా సాగిపోయే పెళ్లి వేడుక స్టేటస్ సింబల్‌గా మారింది. పెళ్లి కూడా ఒక వ్యాపారంలో భాగంగా సంతరించుకుంది. పెళ్లి కూతురు ధరించే దుస్తుల దగ్గర నుంచి ఆమెను అత్తవారింటికి పంపే వరకు, పెళ్లి కొడుకుకు కావాల్సిన వస్తువులను, మండపం అలంకరణలను ఇలా ప్రతి ఒక్కటి చేసి పెట్టడానికి ఎన్నో సంస్థలు వచ్చాయి. ఇప్పుడు ఒక పెళ్లి ఖర్చు రూ.10లక్షల నుంచి రూ.50లక్షల వరకు కూడా అవుతోంది. పెళ్లి పనులు చేసి పెట్టేందుకు మనుషులు రెడిమేడ్‌గా లభిస్తున్నారు. చివరకు పెళ్లి కూతురు బంధువులు పట్టుకురావాల్సిన పెళ్లి వస్తువులు కూడా రెడిమేడ్‌గా వచ్చే అమ్మాయిలే రకరకాల వస్త్రాలు ధరించి మోసు కెళ్లడం కనిపిస్తోంది.
' ప్రత్యేకత కోసం మళ్లీ పల్లకీలు, గుర్రపు బగ్గీలు....
పాత కాలంలో పెళ్లి కూతురును పల్లకీలో, పెళ్లి కొడుకును గుర్రం పైన ఊరేగించే వారు. మధ్య కాలంలో అవి అంతరించి పోయాయి. ప్రస్తుతం పెళ్లిల్లో ప్రత్యేకతగా ఉండడం కోసం మళ్లీ పల్లకీల్లో పెళ్లి కూతురును, గుర్రం బగ్గిల్లో పెళ్లి కొడుకు, పాత కాలపు జీబు, కార్లను మళ్లీ ఉపయోగంలోకి తీసుకువస్తున్నారు.
' ప్యాకేజీలతోనే పెళ్లిళ్లు....
మారుతున్న కాలంతోపాటు పెళ్లి పనులు మారిపోయాయి. కూర్చున్నచోటే ఒక్క ఫోన్‌కాల్‌తో పనులన్నీ ప్యాకేజీ రూపంలో మ్యారేజ్ ప్లానర్స్ సిద్ధం చేసి పెడతారు. మన హంగామాకు తగ్గట్టుగా మ్యారేజ్ ప్లానర్స్ వివిధ రకాల ప్యాకేజీలను అందిస్తున్నారు. పెళ్లి కావాల్సిన ఏర్పాట్లన్ని చేసిపెడితే సర్వీస్‌చార్జీ చెల్లిస్తే సరిపోతుంది. పెళ్లి వేడుకను నిర్వహించడానికి వచ్చిన సంస్థలు ఇప్పుడు కోట్లలోనే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. పెళ్లి పందిరి నుంచి పెళ్లి భోజనాలు, ఫుడ్ స్టాల్స్, వెడ్డింగ్ కార్డ్స్, పెళ్లి ఫొటోలు, ఊరేగింపుతోపాటు పెళ్లికి కావాల్సిన బట్టలు డిజైన్ చేయడం చేస్తుంటారు. నగలే కాదు అబ్బాయి అమ్మాయిలకు వేసుకోవాల్సిన నగలు, రింగ్స్, చేతికి పెట్టుకునే మెహంది, చివరకు చెప్పులను కూడా వారే ఎంపిక చేస్తున్నారు. మ్యారేజ్ ప్లానర్స్ వివిధ రకాల కళాకారులను కూడా పెళ్లిలో ఉపయోగిస్తారు. గతంలో పెళ్లిళ్లను కళ్యాణమండపాల్లోనే నిర్వహించే వారు ఆ పరిస్థితి కూడా మారి పోయింది. మైదాన ప్రాంతంలో రకరకాల సెట్టింగ్‌లను వేస్తున్నా రు. భోజనాల విషయానికి వస్తే బాస్మతి బియ్యంతో బిర్యానీ, మటన్, చికెన్, స్వీట్‌తోపాటు వివిధ ఆహార పదార్థాలతో ప్లేట్ పూర్తిగా నిండిపోతోంది.
' నేడు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక పెళ్లిళ్లు
సుదీర్ఘమూఢం తరువాత పెళ్లిళ్లకు మంచి మూహూర్తాలు వచ్చాయి. కార్తీక మాసం రావడంతో ఈ బుధవారం తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈ నెలలో వచ్చిన మంచి ముహూర్తాల్లో ఈరోజు కూడా ఉందట.. అందుకే చాలా మంది పెళ్లి పెట్టుకుంటున్నారు. ఫంక్షనహాళ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇళ్లముందు పెళ్లిళ్లులు జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.