ఎంపీలు.. ఎమ్మెల్యేలు నోటా ఓటు వేయాలంటే..?

Update: 2015-11-20 06:13 GMT
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే ఏం చేయాలి? ప్రజాస్వామ్యం మీద నమ్మకున్న వ్యక్తిగా.. తన హక్కును వినియోగిస్తూ.. తన గళాన్ని చెప్పాలనుకున్న ఓటరకు ఎలాంటి అవకాశం ఉంది? లాంటి ప్రశ్నలకు సమాధానమే.. ‘‘నోటా’’.  సామాన్య ఓటరు నోటా ఓటు వేసే అవకాశం ఉన్నట్లే.. రాజ్యసభ.. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓట్లు వేసే ప్రజాప్రతినిధులకు ఆ అవకాశాన్ని కల్పిస్తున్నారు.

అయితే.. దీనికి సంబంధించి కొన్ని సందేహాలు చోటు చేసుకున్నాయి. పరోక్ష ఎన్నికల్లో ఏ ప్రజాప్రతినిధి అయినా తమ ప్రాధాన్యతలు 1..2..3 ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇచ్చే క్రమంలో ఒకటో ప్రాధామ్యాన్నినోటాకు ఇచ్చి.. 2.. 3.. ప్రాధామ్యాలు వేరే అభ్యర్థులకు ఇస్తే ఏం చేయాలి? లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కన్ఫ్యూజన్ తీసేసేందుకు తాజాగా ఎన్నికల సంఘం కొన్ని సూచనలు చేసింది. వాటి ప్రకారం.. నోటాను ఎలా వినియోగించాలన్న విషయాన్ని చెప్పటంతో పాటు.. ఎలా వినియోగిస్తే నోటా ఉపయోగపడుతుంది? ఎలా ఓటు వేస్తే చెల్లుబాటు కాకుండా పోతుందన్న విషయంపై ఒక స్పష్టత ఇచ్చారు.

= అభ్యర్థులకు ప్రాధాన్యం ప్రకారం 1..2..3.. నెంబర్లలో ‘‘1’’ని నోటాకు ఇస్తే.. ఇక ఆ ఓటును మిగిలిన వారికి వేసే అవకాశం లేదు.

= ఏ అభ్యర్థికి అయినా ‘‘1’’ని కేటాయించి.. నోటాకూ కేటాయిస్తే.. ఆ ఓటును లెక్కలోకి తీసుకోరు.

= ఏ అభ్యర్థికి అయినా ‘‘1’’ ప్రాధాన్యత కేటాయించి.. ‘‘2’’.. ‘‘3’’ ప్రాధాన్యతల్ని నోటాకు కేటాయిస్తే దాన్ని పరిగణలోకి తీసుకుంటారు.

= అంటే.. మొదటి ఫ్రాధాన్యతను నోటాకు కానీ కేటాయిస్తే.. ఇక ఆ ఓటు పూర్తిగా చెల్లుబాటు కాకుండా పోతుందన్న మాట.
Tags:    

Similar News