టాలీవుడ్ హీరో నాగశౌర్యకు పోలీసులు షాకిచ్చారు. నగర శివారుల్లో ఆదివారం సాయంత్రం ఓ భారీ పేకాట రాయుళ్లు పోలీసుల చేతికి చిక్కడం కలకలం రేపింది.టాలీవుడ్ హీరో నాగశౌర్య ఫామ్ హౌస్ లో పేకాట కలకలం రేపింది. అక్కడ మినీ క్యాసినోను తలపించే రేంజ్ లో కొనసాగుతున్న జూదాన్ని చూసి పోలీసులు కంగుతిన్నారు. బ్యాన్ ఉన్న ఆటకు అడ్డాను సృష్టించడంతో నాగశౌర్యకు నోటీసులు ఇవ్వనున్నారని తెలుస్తోంది.
ఇప్పుడు పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఒక్క నాగశౌర్య ఫాంహౌస్ లోనే కాదు.. శివారుల్లోని అనేక ఫామ్ హౌస్ లో ఇదే దందా జరుగుతోంది. నాగశౌర్య ఫామ్ హౌస్ లో ఆట నడుపుతున్న నిర్వాహకుడు గుత్తా సుమంత్ విచారణలో ఈ విషయాలు బయటకు వస్తున్నాయి.
సుమంత్ అనే వ్యక్తి ఫోన్ ను , కాల్ డేటాను పోలీసులు పరిశీలించగా విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఆయన ఈ ఒక్క ఫామ్ హౌస్ లోనే కాదు.. శివారుల్లోని వేర్వేరు ఏరియాల్లో వేర్వేరు ఫామ్ హౌసుల్లో ఇదే దందా నడుపుతున్నాడని తెలుస్తోంది. ప్రతీ ఫామ్ హౌస్ కి ఒక్కో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినట్లు సమాచారం.ప్రతీ వాట్సాప్ గ్రూప్ లో 200 మంది వరకూ జూదగాళ్లు ఉన్నారట.. అందరూ బడాబాబులే అని తెలుస్తోంది.
చిప్స్ తో ఈ దందా నడిపిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. కార్డు లేకపోతే లిక్విడ్ క్యాష్ తో ఆడుతున్నారు. అందుకు కావాల్సిన సేఫ్టీ, సెక్యూరిటీ ఉంచారట.. ఈ సుమంత్ నే కీలకంగా ఈ డర్టీ గేమ్ ను నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో తెలుస్తోంది.