పేటీఎంలో ఇక ట్రాఫిక్ చలానాలు కట్టేయొచ్చు

Update: 2017-06-08 10:15 GMT
ఆన్ లైన్లో యుటిలిటీ సర్వీసులు అందించే సంస్థల్లో టాప్ లో ఉన్న పేటీఎం మరో కొత్త సర్వీసుతో ఆకట్టుకుంటోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు  పోలీసులు విధించే జరిమామానాలు కూడా ఇక నుంచి పేటీఎంలో చెల్లించేలా అవకాశం కల్పిస్తోంది. బుధవారం నుంచే ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
    
ప్రస్తుతం ముంబయి - విజయవాడ - పుణెల్లో ఈ సదుపాయం అందుబాటులోకి తెస్తున్నారు. ఆ తరువాత మిగతా నగరాలకూ విస్తరించనున్నారు.
    
ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేసిన పక్షంలో అది కట్టడానికి పేటీఎంలో లాగిన్ అయి ‘ట్రాఫిక్ చలాన్’ అన్న ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో వెహికిల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత వివరాలన్నీ ఒకసారి చెక్ చేసుకుని పే చేయాలి. వెంటనే డిజిట్ ఇన్వోయిస్ ఒకటి ఇష్యూ అవుతుంది. ఒకవేళ అప్పటికే పోలీసులు మన వాహనం డాక్యుమెంట్లు కానీ స్వాధీనం చేసుకుంటే ఈ పేమెంటు వారికి అందిన తరువాత పోస్టల్ లో మన చిరునామాకు డాక్యుమెంట్లు పంపించేస్తారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News