ట్విట్టర్ సీఈఓగా భారతీయ అమెరికన్..!

Update: 2022-12-26 23:30 GMT
టెస్లా అధినేత.. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నాక అనేక విషయాలపై పోల్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం.. అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ ఖాతాను పునరుద్ధరించడం.. స్నోడెన్.. అసాంజేలకు అమెరికా ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడం.. వైన్ యాప్ తిరిగి తీసుకురావడం వంటి అంశాలపై ట్విట్టర్ యూజర్ల నుంచి అభిప్రాయం సేకరించారు.

ఈ క్రమంలోనే ట్విట్టర్ సీఈవోగా కొనసాగుతున్న తాను ఆ పదవీ నుంచి నిష్క్రమించాలా?.. వద్దా అనే అంశం సైతం పోల్ నిర్వహించారు. ఈ సర్వేలో లక్షలాది మంది ట్విట్టర్ ఖాతాదారులు తమ అభిప్రాయాన్ని ఎలన్ మస్క్ తో పంచుకున్నారు. అయితే ట్విట్టర్ సీఈవోగా ఎలన్ మస్క్ వైదొలగాలని 57.7శాతం ఓటు వేశారు.

తన పోల్ లోనే తానే ఓడిపోవడంతో ఎలన్ మస్క్ ట్విట్టర్ సీఈవో పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ క్రమంలోనే నాటి నుంచి ట్విట్టర్ సీఈవో ఎంపిక కోసం ఎలన్ మస్క్ కసరత్తులు చేస్తున్నారు. తొలుత ఫన్నీగా మొదలైన ట్విట్టర్ సీఈవో ఎంపిక అది కాస్త సీరియస్ గా మారిపోయింది.

ఈ నేపథ్యంలోనే తాము సీఈవో పదవీ కోసం ఒకరిని ఎంపిక చేయడం లేదని ట్విట్టర్ ను నిలబెట్టే వారి కోసం ప్రయత్నిస్తున్నామని ఎలన్ మస్క్ క్లారిటీ ఇచ్చారు. దీంతో ట్విట్టర్ సీఈవోకు ఎలాంటి అర్హతలు ఉండాలి? ఎలన్ మస్క్ ఎవరినీ ఆ పదవీ కూర్చోబెడుతారనే చర్చ ట్విట్టర్లో జోరుగా సాగుతోంది.

ఇప్పటికే టెక్ దిగ్గజ సంస్థలన్నింటికీ సీఈవోలుగా ప్రవాసీ భారతీయులే ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ కు సైతం సీఈవో ఒక భారతీయుడే ఎంపికయ్యే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తెరపైకి భారతీయ అమెరికన్ శివ అయ్యదురై (59) పేరు వచ్చింది.

ముంబైలో జన్మించిన అయ్యదురై 14 ఏళ్ల వయసులోనే అనగా 1978లో ఇమెయిల్ అనే కంప్యూటర్ సాప్టవేర్ కనిపెట్టాడు. ఇది ఇంటర్‌ ఆఫీస్ మెయిల్ సిస్టమ్ కు సంబంధించిన అన్ని పనులను నిర్వహిస్తుంది. ఇన్‌బాక్స్.. అవుట్‌బాక్స్.. ఫోల్డర్‌లు.. మెమో.. జోడింపులు.. చిరునామా తదితర సదుపాయాలు ఇందులో ఉన్నాయి.

యూఎస్ ప్రభుత్వం అయ్యదురై కనిపెట్టిన ఇమెయిల్ కు 1982లో మొదటి కాపీరైట్‌ను అందింది. తద్వారా అధికారికంగా ఇమెయిల్ యొక్క సృష్టికర్తగా అతడికి గుర్తింపు దక్కింది. బయోలాజికల్ ఇంజనీరింగ్ పీహెచ్డీ సహా మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) నుంచి నాలుగు డిగ్రీలు పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే ట్విట్టర్ సీఈవో పోస్టు కోసం అతడు దరఖాస్తు చేసుకున్నాడు.

ఈ మేరకు తనకు ట్విట్టర్ సీఈవో పదవీపై ఆసక్తి ఉంది.. తాను ఎంఐటీ నుంచి నాలుగు డిగ్రీలు చేశానని.. ఏడు విజయవంతమైన హైటెక్ సాప్ట్ వేర్ కంపెనీలను సృష్టించానని.. దరఖాస్తు చేసే ప్రక్రియకు సలహా ఇవ్వండి అంటూ మస్క్ ను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.

ట్విట్టర్ వినియోగదారు గ్రెగ్ ఆట్రీ స్పందిస్తూ ఉద్యోగంలో తీసుకునేటప్పుడు ఎలన్ మస్క్ చివరిగా చూసే వాటిలో డిగ్రీలు ఒకటి అని నేను గమనించానని అయ్యదురైకి ట్విట్ చేశాడు. మరొకరు మాత్రం మీరు విద్యార్హతలు ప్రస్తావించి నందున మీ దరఖాస్తు తిరస్కరించబడుతుందని నేను ఆశిస్తున్నానంటూ మరొకరు ట్వీట్ చేయడం గమనార్హం..


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News