సీఐఐ, అన్‌రాక్ వినియోగదారుల సర్వే ఎ1-2022 సర్వే ప్రకారం ఇళ్ల కొనుగోలుకు ఎన్నారైలు.. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరును ఎక్కువగా ఎంచుకుంటున్నారు. సర్వే ప్రకారం ఇళ్లు కొనుగోలు చేయాలనుకుంటున్నవారిలో ఏకంగా 60 శాతం మంది ఈ మూడు నగరాలనే ఎంపిక చేసుకుంటుండటం విశేషం.
హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు తర్వాత ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ నాలుగో స్థానంలో నిలిచింది.
కాగా 2021లో మొదటి ఆరు నెలల సర్వేలో అత్యధిక మంది ఎన్నారైలు బెంగళూరు, పూణే, చెన్నై నగరాలను ఎంచుకున్నారు.
ఈ సంవత్సరం మాత్రం ఎన్నారైల ఎంపికలో హైదరాబాద్ అత్యంత ప్రాధాన్యతతో ఉంది. 22 శాతం మంది తెలంగాణ రాజధాని నగరమైన హైదరాబాద్ వైపు మొగ్గుచూపుతున్నారు.
ఇక 20 శాతం మంది ఎన్నారైలు జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్) - ఢిల్లీ పరిసర ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక దేశ ఐటీ రాజధాని బెంగళూరులో ఇళ్లు కొనుగోలు చేయడానికి 18 శాతం మంది ఎన్నారైలు ఇష్టపడుతున్నారు.
అనరాక్ గ్రూప్ సీనియర్ డైరెక్టర్ - రీసెర్చ్ హెడ్ ప్రశాంత్ ఠాకూర్ మాట్లాడుతూ గృహ రుణాల వడ్డీరేట్లు, ఇళ్ల ధరలు పెరుగుతున్నప్పటికీ ఎన్నారైలు ఇళ్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. డాలర్‌తో పోల్చినప్పుడు భారత కరెన్సీ రూపాయి విలువ తక్కువగా ఉండటంతో వారు తమ పెట్టుబడులను ప్రధాన నగరాల్లో ఇళ్ల కొనుగోలుకు వెచ్చిస్తున్నారని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో 2021లో ఇదే కాలంతో పోలిస్తే 2022 మొదటి తొమ్మిది నెలల్లో ఇళ్ల కొనుగోలుకు ఎన్నారైల నుంచి 15-20 డిమాండ్ పెరిగిందని సర్వే వెల్లడించింది.
అనరాక్ పరిశోధన ప్రకారం.. 2022 జనవరి-సెప్టెంబర్ కాలంలో టాప్ ఏడు నగరాల్లో సుమారు 2.73 లక్షల గృహాలు అమ్ముడయ్యాయని ప్రశాంత్ ఠాకూర్ చెప్పారు. సగటున ఏ త్రైమాసికంలో చూసిన అమ్ముడుపోయిన ఇళ్లలో 10-15 శాతం ఎన్నారైల వాటాయేనని వివరించారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా అనేక దేశాల్లో ఆర్థిక మాంద్యం నెలకొంటోంది. దీంతో చాలా మంది ఎన్నారైలు ఆయా దేశాల్లో పెట్టుబడులు పెట్టేకంటే ఇప్పుడు భారత్‌కు తిరిగి వెళ్లాలని చూస్తున్నారని సర్వే పేర్కొంది. వారు రూ. 90 లక్షల నుండి రూ.1.5 కోట్ల మధ్య ప్రీమియం ప్రాపర్టీలను ఇష్టపడుతున్నారని సర్వే వెల్లడించింది.
కాగా డబుల్ బెడ్ రూమ్‌లకంటే కూడా ట్రిపుల్ బెడ్ రూమ్‌లకే డిమాండ్ ఎక్కువగా ఉందని సర్వే తేల్చింది. 38 శాతం మంది ఎన్నారైలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపారు. 44 శాతం మంది ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్ల కొనుగోలుకు మొగ్గు చూపారని సర్వే పేర్కొంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.