ఎన్టీయార్....పవన్... లోకేష్....తమ్ముళ్ళ లెక్కలేంటి...?

Update: 2022-10-01 00:30 GMT
ఏపీలో ఎన్నికల వేడి బాగా రాజుకుంది. పార్టీ క్యాడర్ లో కూడా వచ్చే ఎన్నికల మీదనే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. తెలుగుదేశం పార్టీ ఈసారి తప్పక అధికారంలోకి రావాలని తమ్ముళ్ళు కసి మీద ఉన్నారు. ఆ విషయంలో రెండవ మాట లేదు అని కూడా వారు గట్టి పట్టుదల పడుతున్నారు. 2024లో గెలిచేది టీడీపీనే. అపుడు మేము చూపిస్తాం మా పవరేంటో అని తమ్ముళ్ళు ధాటీగా చెబుతున్నారు.

ఇక టీడీపీలో ఆ మధ్య దాకా జూనియర్ ఎన్టీయార్ జపం చేస్తూ తమ్ముళ్ళు కనిపించారు. చంద్రబాబు ఏ జిల్లా టూర్ కి వెళ్ళినా కూడా జూనియర్ ప్ల కార్డులు పట్టుకుని టీడీపీలోకి ఆయన్ని ఆహ్వానించాలని డిమాండ్ చేస్తూ ఉండేవారు. అయితే చంద్రబాబు తెలివిగానే ఆ విషయాన్ని పక్కన పెట్టి మిగిలిన విషయాలు మాట్లాడుతూ ఉండేవారు.

అయితే ఈ కధ ఇలా సాగుతూండగానే ఏపీలో వైసీపీ దూకుడు పెంచింది. అందులో ఒకటి గత ఏడాది జరిగిన శాసనసభ సమావేశాల్లో చంద్రబాబు ఫ్యామిలీ గురించి అనుచితంగా మాట్లాడడం. దాంతో బాబు కంటతడి పెట్టుకోవడం. అయితే దీని మీద ఎంటీయార్ టోటల్ ఫ్యామిలీ అంతా రెస్పాండ్ అయింది. కానీ జూనియర్ ఎన్టీయార్ లేట్ గా స్పందించారు. అది కూడా ఆయన స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తారనుకుంటే తమ్ముళ్ళకు ఉత్సాహం నింపేలా ఆ వీడియో సందేశం లేదని నాడే పెదవి విరిచారు.

ఇక రెండవ ఎపిసోడ్ చూస్తే లేటెస్ట్ గా ఎంటీయార్ వర్శిటీకి పేరు తొలగిస్తూ వైసీపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దాని మీద కూడా మళ్ళీ నందమూరి ఫ్యామిలీ సహా అంతా రియాక్ట్ అయ్యారు. అయితే ఈసారి జూనియర్ ముందుగానే స్పందించారు. కానీ ఆయన హుందా అయిన స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని తమ్ముళ్ళు పెద్దగా ఆహ్వానించలేకపోతున్నారుట. జూనియర్ పులిబిడ్డలా రెస్పాండ్ అవుతారు అనుకుంటే మెత్తమెత్తగా ట్వీట్ చేశారని నిరాశకు లోను అయ్యారట.

ఇక ఇవన్నీ పక్కన పెడితే ఏ కారణం చేతనైనా జూనియర్ బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ కావడం అదే టైం లో కష్టాలలో ఉన్న టీడీపీ వైపు కనీసంగా నిలబడే సంకేతాలు కూడా ఇవ్వకపోవడంతో తమ్ముళ్ళు తీవ్రంగా మధనపడుతున్నారుట. జూనియర్ ఇపుడు టీడీపీకి కొమ్ము కాస్తేనే కాయాలి. ఇది టీడీపీకి చావో రేవో సమస్య. ఇపుడు వదిలేస్తే మళ్ళీ ఎపుడు వచ్చి టీడీపీకి ఏం ఉపయోగం ఉంటుంది అన్నది తమ్ముళ్ళ అక్షేపణ పూరితమైన మాటగా కనిపిస్తోంది.

దీంతో ఇటీవల కాలంలో జరిగిన అనేక పరిణామాల తరువాత జూనియర్ మీద తమ్ముళ్ళు దాదాపుగా ఆశలు వదిలేసుకున్నారని అంటున్నారు. లోకేష్ టీడీపీ కోసం కష్టపడుతున్నారని, ఆయన వల్లనే టీడీపీ అధికారంలోకి వస్తుందని కూడా కొందరు తమ్ముళ్ళు అంటూంటే పవన్ కళ్యాణ్ తో పొత్తు ఉంటే ఈజీగా వైసీపీని ఓడించగలమని మరికొందరు తమ్ముళ్ళు అభిప్రాయపడుతున్నారుట.

అయితే ఈసారి పొత్తులు లేకుండా సొంతంగానే టీడీపీ అధికారంలోకి రావాలని ఎక్కువ మంది తమ్ముళ్ళు కోరుకుంటున్నారుట. మొత్తానికి చూస్తే తమ్ముళ్ళు కొంతమంది జూనియర్ వస్తాడని ఆశ పడినా ఆ వైపు నుంచి సంకేతాలు లేకపోవడంతో డీలా పడినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో లోకేష్ వైపు మొగ్గుతున్న వారు కూడా పెరుగుతున్నారని టాక్.

ఇక పవన్ తో పొత్తులు పెట్టుకోవాలని కోరే తమ్ముళ్ళ జాబితా కూడా ఎక్కువగానే ఉంది. ఇవన్నీ పక్కన పెడితే తాత పెట్టిన పార్టీకి జూనియర్ సాయం చేయడంలేదని తమ్ముళ్లకు ఉన్నా అటువంటి పరిస్థితి టీడీపీ అధినాయకత్వం కల్పించడంలేదు అన్న వారూ ఉన్నారు. మరి తమ్ముళ్లకు మాత్రం వైసీపీని దింపాలని కసి ఉంది. అది ఏ కాంబినేషన్ తో జరుగుతుందో మాత్రం వారికైతే అర్ధం కావడంలేదు అన్నదే అసలైన విశ్లేషణ.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News