పెరుగుతున్న ఇంధన ధరలను దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. విద్యుత్ తో నడిచే కార్లను, బైక్లను కొనుగోలు చేసే దానికి ఆసక్తి చూపిస్తున్నారు. భవిష్యత్తు లో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను దృష్టిలో ఉంచుకొని ప్రముఖ రైడ్ బుకింగ్ అప్లికేషన్ అయినా ఓలా కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ వాహనాలను ఉత్పత్తి చేసేందుకు నడుంబిగించింది. శర వేగంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేస్తున్న ఈ సంస్థ అతి తక్కువ కాలంలోనే ప్రజలకు అందజేయాలని భావించింది.
ఇందుకు సంబంధించి ఆగస్ట్ 15 న బుకింగ్లను స్టార్ట్ చేసింది. బుకింగ్స్ ను ప్రారంభించిన నాడే ఓలా సీఈఓ భవిష్య అగర్వాల్ డెలివరీ డేట్ ను కూడా ముందుగానే ప్రకటించారు. ముందుగా అనుకున్న దాని ప్రకారం అక్టోబర్ నెల మధ్యలో స్కూటర్ల డెలివరీ ఇవ్వాల్సి ఉంది. అయితే పలు సాంకేతిక కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం వాయిదా పడింది. ఇంతలోనే మార్కెట్లో పేరు తగ్గకూడదని నిర్ణయంతో సీఈవో టెస్ట్ డ్రైవ్ పేరిట దేశవ్యాప్తంగా ఈ స్కూటర్ను తిప్పి ప్రపంచ రికార్డును సృష్టించారు.
క్రమక్రమంగా ఓలా స్కూటర్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. డిసెంబర్ రెండో వారం నుంచి ఈ స్కూటర్లను ముందుగా బుక్ చేసుకున్న వినియోగదారులకు అందజేశారు. అయితే వీటిని కేవలం రెండు మెట్రో నగరాలకు మాత్రమే పరిమితం చేశారు. వాటిలో ఒకటి బెంగళూరు కాగా రెండోది చెన్నై. అయితే మరో దశలో ఓలా స్కూటర్లను ముందుగా బుక్ చేసుకున్నటువంటి వినియోగదారులకు అందజేయనున్నట్లు సీఈఓ భవిష్య అగర్వాల్ పేర్కొన్నారు. ఈ జాబితాలో కొన్ని నగరాలను ఎంపిక చేశారు.
వాటిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన విశాఖపట్నం ఒకటిగా ఉంది. సాధారణంగా ఎక్కువ డిమాండ్ ఉండేది హైదరాబాదులో దీనిని డెలివరీ ఇస్తున్నారా లేదా అనే దానిపై భవిష్య అగర్వాల్ ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో ఓలా స్కూటర్ల డెలివరీ హైదరాబాద్ లో ఉంటుందా లేదా అనే దానిపై వినియోగదారుల్లో నిరాశ మిగిలింది.
రెండో దశలో డెలివరీ ఇచ్చే నగరాల్లో వైజాగ్ తో పాటు పూణే, అహ్మదాబాద్, ముంబై లాంటి నగరాలు కూడా ఉన్నాయి. ఈ నగరాల్లో ఓలా త్వరలోనే డెలివరీ ని ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఇదిలా ఉంటే ఓలా కు ప్రత్యామ్నాయంగా బౌన్సి అనే కంపెనీ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ లను ఉత్పత్తి చేస్తోంది. కేవలం 36 వేలకే స్కూటర్లను వినియోగదారులకు అందిస్తుంది. ఈ రెండింటికీ మధ్య మార్కెట్లో ఇప్పుడు పోటీ నెలకొందని నిపుణులు చెబుతున్నారు.