ఇంతకూ జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి?
రిటైర్డు ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ అధికారులు దాడులు చేయటం.. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాక్రిష్ణ.. లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లటం తెలిసిందే. అయితే.. ఆయన మీడియాలోనూ.. మరికొన్ని మీడియా సంస్థల్లోనూ లక్ష్మీనారాయణ కోసం ఆర్కే ఇంటికి వెళ్లారని.. అక్కడ ఏపీ సీఐడీ అధికారులు వినతితోనే ఆయన ఎక్కువసేపు అక్కడే ఉండాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
మరో వైపు మరికొన్ని మీడియా సంస్థలు.. పలు యూట్యూబ్ ఛానళ్లలోనూ లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లిన ఆర్కే.. ఏపీ సీఐడీ అధికారుల్ని అడ్డుకున్నారని పేర్కొన్నారు.
దీనిపై ఆంధ్రజ్యోతి గట్టిగా ఖండించటమే కాదు.. అసలు ఏపీ సీఐడీ అధికారుల కోరిక మేరకే ఆర్కే ఉన్నారని.. ఆ మాటకు వస్తే.. ఆయన వెళ్లిన తర్వాత లక్ష్మీనారాయణ.. ఆయన కుటుంబ సభ్యులు తనిఖీలకు అనుమతించినట్లుగా పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. ఆదివారం అనూహ్యంగా ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిష్ణపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు కావటం సంచలనంగా మారింది. దీనిపై పలువురు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ఏపీ ప్రభుత్వ తీరును తప్పు పడుతున్నారు.
ఆర్కే మీద జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం ఉందా? అన్నది చర్చగా మారింది.నిజంగానే ఆర్కే తప్పు చేసి ఉంటే.. ఏపీ సీఐడీ అదే రోజు ఏదో ఒక చర్య తీసుకోవాలే కానీ.. ఇంత రచ్చ జరిగిన తర్వాత? అన్నదిప్పుడు ఒక ప్రశ్న.
అదే సమయంలో.. జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి? దాని వల్ల లాభమా? నష్టమా? అన్న చర్చ జరిగింది. ఇక.. జీరో ఎఫ్ఐఆర్ అంటే.. ఎవరైనా సరే పోలీస్ స్టేషన్ కు వెళ్లి తమకు జరిగిన నష్టం.. కష్టం గురించి ఫిర్యాదు ఇస్తే.. దాన్ని స్వీకరించిన పోలీసులు.. ఎఫ్ఐఆర్ కడతారు.
ఎఫ్ఐఆర్ అంటే.. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు. అయితే.. ఇలా ఫిర్యాదు తీసుకోవటం.. ఎఫ్ఐఆర్ రాయటం అంతా కూడా సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన వారు మాత్రమే ఫిర్యాదు ఇవ్వగలుగుతారు.
మారిన కాలానికి అనుగుణంగా.. అవసరాల్ని గుర్తించిన ప్రభుత్వం.. కేసు కట్టేందుకు.. నేరం జరిగినట్లుగా చెప్పే సదరు పోలీస్ స్టేషన్ లో మాత్రమే ఫిర్యాదు చేయాలన్న రూల్ కారణంగా చాలామంది సామాన్యులు ఇబ్బందులకు గురి కావటమే కాదు.. కష్టాలు ఎదురవుతున్నాయని.. వారికి అలాంటి కష్టం లేకుండా ఉండేందుకు.. అందరికి సౌలభ్యంగా ఉండాలన్న లక్ష్యంతో ‘జీరో’ ఎఫ్ఐఆర్ ను తీసుకొచ్చారు.
ఇందులో ఏ పోలీస్ స్టేషన్ లో అయినా సరే.. ఎవరైనా సరే తమకు జరిగిన కష్టానికి.. సమస్యకు సంబంధించిన ఫిర్యాదును ఇస్తే.. సదరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదును తీసుకొని జీరో ఎఫ్ఐఆర్ కట్టేస్తారు. అనంతరం.. దాన్ని నేరం జరిగిందని చెప్పే పోలీస్ స్టేషన్ పరిధికి పంపిస్తారు.
నిర్భయ కేసు తర్వాత వచ్చిన అనేక చట్టపరమైన మార్పుల్లో ఇదొకటిగా చెప్పాలి. జస్టిస్ వర్మ కమిటీ ఆధారంగా క్రిమినల్ లా సవరణ చట్టం 2013లో ఈ జీరో ఎఫ్ఐఆర్ అంశాన్ని కొత్తగా ప్రవేశ పెట్టారు.
ఇంతకూ జీరో ఎఫ్ఐఆర్ అన్న పదాన్ని ఎందుకు వాడతారంటే.. సాధారణంగా ఎఫ్ఐఆర్ కట్టిన వెంటనే.. కేసుకు సంబంధించిన నెంబరు ఇస్తారు. జీరో ఎఫ్ఐఆర్ లో మాత్రం ఎఫ్ఐఆర్ రాసినప్పుడు ‘జీరో’ అంకెను వేస్తారు. సంబంధిత పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసిన తర్వాత దానికి నెంబరు ఇస్తారు. ఈ కారణంతోనే దీనికి జీరో ఎఫ్ఐఆర్ అని పిలుస్తుంటారు. పేరుకు జీరో ఎఫ్ఐఆర్ కానీ.. దాని విలువ మాత్రం ఏ మాత్రం తగ్గదు.
ప్రజలు తాము ఎదుర్కొనే కష్టాల గురించి ధైర్యంగా కంప్లైంట్ చేయటానికి వీలుగా ఈ విధానం సాయం చేస్తుంది.
జీరో ఎఫ్ఐఆర్ ను బాధితులు.. కుటుంబ సభ్యులు.. సాక్షులు.. నేరస్తులు.. పోలీసులు.. జడ్జీల ఆదేశాలతోనూ.. నేరం గురించి తెలిసిన వెంటనే ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు. ఆ వెంటనే కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. నేరం జరిగిన ప్రాంతంలో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్ లో అయినా కేసు పెట్టటమే జీరో ఎఫ్ఐఆర్ ప్రధాన ఉద్దేశం. ఇది అందరికి వర్తిస్తుంది.
ఏపీ సీఐడీ అధికారుల విధుల్ని అడ్డుకున్న ఆరోపణపై ఆంధ్రజ్యోతి ఎండీపై ఈ విధానంలోనే కేసు నమోదు చేశారు. మిగిలిన వాటి మాదిరి జీరో ఎఫ్ఐఆర్ కారణంగా లాభాలు ఎలా ఉంటాయో కొన్నిసార్లు నష్టాలు ఉంటాయి. దాన్ని ఎవరు.. ఏ తీరులో.. ఉపయోగించుకుంటారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది.
న్యాయం త్వరగా జరగాలన్న సదుద్దేశంతో ఈ జీరో ఎఫ్ఐఆర్ ను తెర మీదకు తీసుకొచ్చారు. అయితే.. కొన్నిసార్లు మాత్రం వేధింపులకు సైతం ఈ విధానాన్ని అస్త్రంగా వినియోగించుకోవటం కనిపిస్తుంది.