ఒక్క డెసిషన్ : ఏడు రాష్ట్రాల మీద భారీ ప్రభావం...?

Update: 2022-06-22 07:38 GMT
రెండు సీట్ల నుంచి ఈ రోజుని దేశాన్ని ఏలే స్థాయికి అది కూడా పూర్తి మెజారిటీతో రెండు సార్లు గెలవడం అంటే బీజేపీ వ్యూహాలు ఏ తీరున ఉంటాయో సామాన్యులకు అర్ధం కాదు. బీజేపీలో  ఎన్నో విభాగాలు ఉన్నాయి. అలాగే దాని మాతృ సంస్థ ఆరెస్సెస్ నిరంతం దిశా నిర్దేశం చేస్తూనే ఉంటుంది. అందుకే ఏ పార్టీకి లేని బలమైన ఐడియాలజీ ఆ పార్టీకి ఉంది. అంతే కాదు దాన్ని పెర్ఫెక్ట్ గా అమలు చేసే మిషనరీ కూడా ఉంది.

అందుకే ఈ రోజు బీజేపీ దేశంలో వెలిగిపోతోంది. ఇక బీజేపీ ఫస్ట్ టైమ్ ఆదివాసీకి చెందిన మహిళను రాష్ట్రపతి పీఠం మీద కూర్చోబెడుతోంది. అలాగే మహిళకు ప్రతిభా పాటిల్ తరువాత తానే అవకాశాన్ని  ఇచ్చానని చెప్పుకుంటోంది. ఇలా చాలా ప్రయోజనాలను ఆశించి ఈ ఎంపిక జరిగింది అని అంటున్నారు.

దేశంలోని తూర్పు ప్రాంతంలో బీజేపీ ఈసారి గట్టిగానే  బలపడాలని చూస్తోంది. ముఖ్యంగా ఒడిషా, జార్ఖండ్ రాష్ట్రాల మీద కన్ను ఉంది. అలాగే పశ్చిమ బెంగాల్ కూడా ఎప్పటికైనా తమదే అని అనుకుటోంది. ఇక ఈ రాష్ట్రాలలో ఎస్టీలు ఎక్కువ మంది ఉన్నారు. అలాగే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ లో  త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. అక్కడ ఎస్టీలు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. ఇక మధ్యప్రదేశ్ వంటి చోట్ల కూడా బీజేపీ పాగా వేయడానికి ఎస్టీల ఓట్లు కీలకం కాబోతున్నాయి.

మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం సీట్లలో 47 ఎస్టీ సీట్లే ఉన్నాయి. వీటిని కనుక గంపగుత్తగా దక్కించుకుంటే బీజేపీ ఖాతాలో  ఒక మంచి నంబర్ ఉంటుంది. ఆ మీదట పరిస్థితులను సానుకూలం చేసుకుని మరిన్ని సీట్లు దక్కించుకోవచ్చు. ఇక మహిళా ఓట్ల మీద కూడా బీజేపీ గురి పెట్టింది. మహిళా ఓటర్లే దేశంలో ఎక్కువగా ఉన్నారు. వారే పోలింగుకు వచ్చి ఓటేసేది.

వారి మనసు కనుక ఒకసారి తమ వైపునకు తిప్పుకుంటే తిరుగేలేదని ఆ పార్టీ భావిస్తోంది. అందులో భాగమే మహిళను తెచ్చి రాష్ట్రపతిని చేశారు అని అంటున్నారు. ఇక ఒడిషా లో నవీన్ పట్నాయక్ ఇప్పటికి నాలుగు సార్లు గెలిచారు.

మరో రెండేళ్ళలో అక్కడ ఎన్నికలు ఉన్నాయి అక్కడ బీజేడీ సర్కార్ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడానికి  రాజకీయ సామాజిక పరిస్థితులను బీజేపీకి అనుకూలం చేసుకోవడానికే ద్రౌపది ముర్ముని ఎంపిక చేశారు అని అంటున్నారు. అలాగే జార్ఖండ్ లో పవర్ కోసం బీజేపీ  ప్లాన్ వేస్తోంది. ఇలా ఎన్నో సమీకరణలు ఎన్నో లెక్కలు అన్నీ కలసి బీజేపీ రాష్ట్రపతి ఎంపిక విషయంలో మాస్టర్ ప్లాన్ వేసింది అని అంటున్నారు. అది హిట్ అయిన్ తీరుతుందని కూడా కమలనాధులు దృఢ విశ్వాసంతో ఉన్నారు.
Tags:    

Similar News