ఒక్క అమ్మాయి..నలుగురు లవర్లు.. పెళ్లి కోసం లక్కీ డ్రా

Update: 2021-03-05 23:30 GMT
ఒక అమ్మాయిని ప్రేమించిన నలుగురు యువకుల మధ్య లక్కీ డ్రా నిర్వహించారు. అందులో గెలిచిన యువకుడు లక్కీ డ్రా నిర్వహించి ఒకరికి వధువును కట్టబెట్టారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగింది..

అజీమ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు అబ్బాయిలు నివసిస్తున్నారు. ఆ నలుగురు కలిసి తాండా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ అమ్మాయిని ప్రేమించారు. ఆ అమ్మాయి కూడా ఎవరిని కాదనకుండా ఆ నలుగురిని ప్రేమించింది. కొంతకాలం ఈ నలుగురి ప్రేమాయణం సాగిన తర్వాత ఆ నలుగురూ కలిసి అమ్మాయిని ఎత్తుకెళ్లి వేరే ఊరిలో దాచిపెట్టారు.

రెండు రోజుల తర్వాత ఈ విషయం ఆ నోటా, ఈ నోటా అమ్మాయి గ్రామానికి చేరింది. విషయం బయటపడ్డ తర్వాత ఆ లవర్లను బలవంతంగా ఊరికి తీసుకొచ్చారు. అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి రెడీ అయ్యాడు. గ్రామస్థులు వారించి ఎత్తుకెళ్లిన అబ్బాయిల్లో ఒకరితో ఆ అమ్మాయి వివాహం చేసేద్దామని తండ్రిని సముదాయించారు.

పెద్దలు నలుగురిలో ఏ అబ్బాయిని చేసుకుంటావని అమ్మాయిని అడిగారు.  కానీ అమ్మాయి ట్విస్ట్ ఇచ్చింది. నలుగురూ ఇష్టమే అన్నది. నలుగురూ తామే చేసుకుంటామని పట్టుబట్టారు. దీంతో లక్కీ డ్రా వేసి ఒక అబ్బాయిని డ్రాలో ఎంపిక చేసి ఆ అమ్మాయితో పెళ్లి చేశారు. ఇలా నలుగురి అబ్బాయిలను లక్కీడ్రాతో అమ్మాయికి ఎంపిక చేయడం విశేషం.
Tags:    

Similar News