ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న వైరస్ కరోనా.. చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 180కుపైగా దేశాలను వణికిస్తూ వేలమంది మరణాలకు కారణమవుతోంది. ఇప్పటివరకు 15వేల మంది మరణించగా.. 65వేల మందికిపైగా బాధితులున్నారు. భారత్ లోనూ కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది.
అయితే గత ఏడాది డిసెంబర్ లో చైనాలో వూహాన్ సిటీలో వెలుగుచూసిన ఈ కరోనా వైరస్ ఇప్పుడు మాత్రం ఆ నగరంలో ఖతమైపోవడం విశేషం. చైనా వూహాన్ లో లాక్ డౌన్ ప్రకటించి రోగులకు చికిత్సనందించి మొత్తం నియంత్రించి అద్భుతమే చేసింది.
తాజాగా వూహాన్ సిటీలో కొత్తగా కరోనా కేసులు నమోదవడం లేదని అధికారులు ప్రకటించారు. చైనా మొత్తం మీద 39 కేసులు నమోదైనప్పటికీ అందులో 34మంది విదేశీయులేనని తెలిపారు. కరోనాను చైనాలోని వూహాన్ లో మొత్తం అదుపులోకి తీసుకువచ్చారు.ప్రస్తుతం లాక్ డౌన్ ఎత్తివేసి అక్కడ సాధారణ పరిస్థితులు కల్పించారు. వూహాన్ సిటీ ఇప్పుడు లైట్లతో వెలిగిపోతూ జనసాంద్రతతో కనిపిస్తున్న వీడియోను చైనా ట్విట్టర్ లో షేర్ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా బెంబేలెత్తిస్తున్న కరోనాను చైనా అధికారులు వూహాన్ లో కఠినమైన నిబంధనలు, నియంత్రణతో అదుపులోకి తీసుకున్నారు. జనవరి 23న లాక్ డౌన్ లోకి వెళ్లిన వూహాన్ లో ఎంతో కష్టపడి వైరస్ ను నియంత్రణలోకి తెచ్చారు.
తాజాగా చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్ వర్క్ (సీజీటీఎన్) ఒక డాక్యుమెంటరీని యూట్యూబ్ లో విడుదల చేసింది. హృదయాన్ని తాకేలా చైనా కరోనాను ఎలా నియంత్రించింది.. ఎలా రోగులకు చికిత్స చేసింది? ఎలా చర్యలు చేపట్టిందనేది కళ్లకు కట్టింది. ఈ 30 నిమిషాల డాక్యుమెంటరీ చూస్తే అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది. కరోనా చేసిన బీభత్సం చూసి వెన్నులో వణుకు పుడుతోంది. చైనాలో కరోనా సోకిన ప్రజలను, నగరాన్ని కాపాడడానికి ఆరోగ్య కార్యకర్తలు ఎంత త్యాగం చేశారో ఈ డాక్యుమెంటరీలో చూపించారు. వారిని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.
లాక్ డౌన్ సందర్భంగా కరోనా రోగులకు ఎంత కష్టపడి వైద్యులు, నర్సులు, ఆస్పత్రులు సేవలందించారో వారు ఎంత కష్టపడ్డారో చూడా డాక్యుమెంటరీలో చూపించారు. ఈ ఒక్క వీడియో చూస్తే కరోనాపై చైనా యుద్ధం ఎలా ఉందో కళ్లకు కడుతోంది.
కరోనా వైరస్ పుట్టిన వూహాన్ లో పూర్తిగా కట్టడి చేసిన చైనాను అందరూ అభినందిస్తున్నారు. మిగతా ప్రపంచం కూడా చైనాను ఫాలో కావాలని సూచిస్తున్నారు.
Full View