ఈ ప్రపంచకప్ లో టీమిండియాకు ఇది మూడో షాక్. మరో ఎదురుదెబ్బ. వరుసగా గాయాల బారిన పడి ఇప్పటికే శిఖర్ ధావన్ ప్రపంచకప్ నుంచే వైదొలిగారు. ఇక భువనేశ్వర్ గాయం కారణంగా ఆటకు దూరమయ్యారు. ఇప్పుడు మరో కీలక ఆటగాడు గాయంతో టోర్నీ నుంచే వైదొలగడం టీమిండియాకు భారీ షాక్ గా మారింది.
టీమిండియా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ నెట్ ప్రాక్టీస్ లో బ్యాటింగ్ చేస్తుండగా బుమ్రా విసిరిన యార్కర్ కు విజయ్ కాలిని గాయపర్చింది. దీంతో అతడు నొప్పితో విలవిలలాడాడు. అయితే గాయం నుంచి కోలుకొని అప్ఘాన్- వెస్టిండీస్ లతో మ్యాచ్ లు ఆడాడు. కానీ గాయం తాజాగా తిరగబెట్టడంతో తాజాగా పరీక్షలు చేశారు. అది పెద్దది కావడంతో ఇప్పుడు గాయం కారణంగా మొత్తం ప్రపంచకప్ టోర్నీ మొత్తానికి విజయ్ శంకర్ దూరమవుతున్నట్టు టీమిండియా మేనేజ్ మెంట్ సంచలన ప్రకటన చేసింది.
విజయ్ శంకర్ స్థానంలో ఎవరు వస్తారనేది సస్పెన్స్ గా మారింది. అయితే టెస్టుల్లో రాణిస్తున్న మయాంక్ అగర్వాల్ కు చోటు కల్పించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.