దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి , దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న వన్ నేషన్..వన్ రేషన్ కార్డు పథకాన్ని తక్షణమే అములు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జులై 31వ తేదీ నాటికి ఈ వన్ నేషన్..వన్ రేషన్ పథకాన్ని అన్ని రాష్ట్రాలు ,కేంద్ర పాలిత ప్రాంతాలు తప్పనిసరిగా అమలు చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్ ఎంఆర్ షాలతో కూడిన బెంచ్ తెలిపింది. దీనికి డెడ్ లైన్ కూడా విధించింది. జులై 31వ తేదీ నాటికి ఈ పథకాన్ని అమలు చేసి తీరాలని సుప్రీంకోర్టు అల్టిమేటం ఇచ్చింది.
కరోనా వైరస్ మహమ్మారి ముగిసేవరకు వలసదారులకు ఆహారం అందించడానికి రాష్ట్రాలు కమ్యూనిటీ కిచెన్లను నడపాలి అని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రాలకు అదనపు ఆహార ధాన్యాలు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. వలస కార్మికుల నమోదు కోసం, జూలై 31 లోగా పోర్టల్ ని ఏర్పాటు చేయాలని కోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. వలసదారులకు రేషన్ పంపిణీ కోసం రాష్ట్రాలు తప్పనిసరిగా పథకాన్ని తీసుకురావాలని కోర్టు తెలిపింది. ఇప్పటి వరకు ఈ పథకాన్ని అమలు చేయని రాష్ట్రాలు జూలై 31 లోపు తప్పక అమలు చేయాలి అని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టం చేసింది.