బీజేపీలో అంతా అవినీతిప‌రుల‌ట‌!

Update: 2018-06-10 16:56 GMT
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అత్య‌ధిక సీట్లు క‌ట్ట‌బెట్టిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఇప్పుడు అదే రీతిలో అనేక ట్విస్టుల‌ను సైతం ఇస్తోంది. ఒక‌రి వెంట ఒక‌రు అన్న‌ట్లుగా నాయ‌కులు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తున్న తీరు ఆ పార్టీ నేత‌ల‌నే ఆలోచ‌న‌లో ప‌డేస్తోంది. యూపీకి చెందిన  ఎంపీ సురేంద్ర సింగ్ ఈ మధ్యే ప్రభుత్వ అధికారులను వేశ్యలతో పోల్చిన విషయం తెలిసిందే. దీనిపై ర‌చ్చ ర‌చ్చ అవ‌గా ఆ ప‌రిస్థితి ఇంకా స‌ద్దుమ‌ణ‌గ‌క‌ముందే మ‌రో వివాదం తెర‌మీద‌కు వ‌చ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అయిన ఉత్తరప్రదేశ్‌ కు చెందిన బీజేపీ ఎంపీ  బ్రిజ్ భూషణ్ శరణ్ తాజాగా క‌ల‌క‌లం రేపే కామెంట్లు చేశారు.

గతంలో రాహుల్‌ గాంధీని మొరిగే కుక్క అంటూ నోరు పారేసుకున్న బ్రిజ్ భూషణ్ శరణ్ తాజాగా సొంత పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో కేవలం ఇద్దరే నీతిమంతులంటూ ఆయ‌న క‌ల‌క‌లం రేపే కామెంట్లు చేశారు. ఆ ఇద్ద‌రే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ - యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఈ ఇద్ద‌రు మాత్రమే ఎప్పుడూ అవినీతికి పాల్పడబోరని, మిగతా పార్టీ నేతలు అలా కాదని ఆయన అన్నారు. ``మన ప్రధాని మోదీ - సీఎం యోగి ఎప్పుడూ ఎలాంటి అవినీతికి పాల్పడరు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి.. ఆ ఇద్దరు మాత్రమే నీతిమంతులు. మిగతా పార్టీ నేతలు అలా కాదు`` అని శరణ్ నొక్కి చెప్పారు.
Tags:    

Similar News