ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పగలనక.. రాత్రనకా పని చేయటం విన్నారా? అన్న ప్రశ్న వేసిన వెంటనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తుకు వస్తారు. నిజానికి.. ఆయన సంగతేమో కానీ.. అర్థరాత్రి వరకూ నిద్రపోకుండా సీరియస్ గా పని చేసే ముఖ్యమంత్రులు దేశంలో కొద్ది మంది ఉంటారు. కాకుంటే.. తమ గురించి తాము ప్రచారం చేసుకునే విషయంలో పెద్దగా ఆసక్తి లేకపోవటం.. మీడియాకు ముడిసరుకుగా మారి.. ప్రచారం పొందటం లాంటివి చాలామంది ముఖ్యమంత్రులకు పెద్గగా రావని చెప్పాలి.
విపరీతంగా పని చేస్తూ.. సదరు రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతులు పుష్కలంగా ఉన్నా.. పక్క రాష్ట్రాలకు పెద్దగా తెలియని ముఖ్యమంత్రుల్లో కేరళ సీఎం ఒకరు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఆయన గురించి దక్షిణాది ప్రజలకు తెలిసింది తక్కువ. హైటెక్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరును దక్షిణాదినే కాదు.. ఉత్తరాదిన ప్రస్తావించినా వెంటనే గుర్తు పట్టేస్తారు. కానీ.. కేరళ సీఎం ఊమెన్ చాందీ విషయం అలా కాదు.
తాజాగా ఆయనకు సంబంధించిన ఆసక్తికర అంశాలతో కూడిన ఒక పుస్తకం వచ్చింది. ఊమెన్ చాందీ దగ్గర చీఫ్ సెక్రటరీగా పని చేసిన టీఎస్ పిళ్లై ఒక పుస్తకం రాశారు. ఇందులో ఊమెన్ చాందీ గురించి కొన్ని ఆసక్తికర విషయాల్ని ప్రస్తావించారు. చాందీ తన దైనందిక పనుల్లో భాగంగా ఫైళ్లను సంతకాలు చేయటం మామూలే అయినా.. రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా ఫైళ్లను అవిశ్రాంతంగా చూస్తూనే ఉంటారట. అర్థరాత్రి వేళ కూడా ఆయన ఫైళ్లను నిశితంగా పరిశీలిస్తారట.
అయితే.. ఆయన ఫైళ్ల మీద సంతకం పెట్టే తప్పుడు తేదీ తప్పుగా రాస్తే.. ఆయనకు నిద్ర బాగా వస్తున్నట్లుగా గుర్తు అంట. తాను ఫైళ్లు చూసేటప్పుడు సహాయకుడిని దగ్గర పెట్టుకునే ఆయన.. తేదీ తప్పుగా రాస్తే.. గుర్తించిన వెంటనే నిద్రకు వెళ్లిపోతారట.
ఒకసారి ఆయన విమానంలో ముందుసీట్లో కూర్చున్నారట. అయితే.. ఆ సీట్లో కాకుండా వెనుక సీట్లో కూర్చోవాలంటూ ఎయిర్ హోస్టెస్ చెప్పిందట. ఆయన మరో మాట మాట్లాడకుండా వెళ్లి వెనుకసీటులో కూర్చున్నారట. ఆయన్ను వెనుక సీట్లో కూర్చోమని చెప్పిన ఎయిర్ హోస్టెస్ కు ఆయన ముఖ్యమంత్రి అన్న విషయం తెలిసి.. వణికిపోయి ఆయన దగ్గరకు వెళ్లిన సమయానికి ఆయన మాంచి నిద్రలోకి జారుకున్నారట. ఊమెన్ చాందీ కాబట్టి సరిపోయింది.. అదే మరో సీఎంకు అలాంటి పరిస్థితే ఎదురైతే.. ఆ ఎయిర్ హోస్టెస్ సంగతి ఏమతువుందో కదా..? ఈ రోజుల్లో కూడా ఇంత సింఫుల్ గా ఉండే సీఎంలు ఉండటం గొప్పే కదూ.