నాలుగేళ్లపాటు అధికారం కలిసి పంచుకొని..పొత్తుకు గుడ్ బై చెప్పిన అనంతరం తెలుగుదేశం పార్టీ మాజీ మిత్రపక్షమైన బీజేపీపై అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెలిసిందే. ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోవడం కూడా తెలిసిన సంగతే. అయితే ఈ చర్చ సందర్భంగా పార్లమెంట్ లో జరిగిన సీన్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి - మరోవైపు చర్చ అనంతరం పలితాలపై రాజకీయ వర్గాలు తమదైన శైలిలో స్పందిస్తున్నాయి. తాజాగా ఈ ఫలితాలపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్పందించారు. వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు ఇదే సంకేతంగా నిలుస్తుందన్నారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో గెలుపు తమదేనని విశ్లేషించారు.
లోక్ సభలో అవిశ్వాస తీర్మానంలో ప్రతిపక్షాలు ఓడిపోవడం అంటే అది వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల ఫలితాలకు నిదర్శనంగా నిలుస్తుందని షా తెలిపారు. మోడీ ప్రభుత్వం తీరుకు ఇదే నిదర్శనమన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాశ్ మంత్రంతో మోడీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అవిశ్వాసం వీగిపోవడం ప్రజాస్వామ్య విజయమని - కుటుంబ రాజకీయాలకు ఇది చరమగీతం పాడిందని షా అన్నారు. కేవలం మోడీ ప్రభుత్వంపైనే ప్రజలకు విశ్వాసం ఉందన్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం లోక్ సభలో ప్రధాని మోడీని కౌగిలించుకున్న తీరు భారతీయ మీడియాను ఆకర్షించింది. ఔను దేశంలోని అన్ని ప్రధాన పత్రికలతో సహా చిన్నా - చితక పత్రికలు కూడా అదే వార్తాంశాన్ని ప్రచురించాయి. అంతకుముందే టీవీ చానల్లు డిజిటల్ మీడియా హోరెత్తించిన సంగతి తెలిసిందే. మోడీని రాహుల్ అలా హత్తుకున్నారో లేదో.. సోషల్ మీడియాలో ఆ వార్త గుప్పుమంది. ట్విట్టర్ - ఎఫ్ బీలో ఆ హగ్ ఫోటోలు హోరెత్తాయి. హ్యాష్ ట్యాగ్ లు - సెటైర్ కామెంట్లతో ఆన్ లైన్ రీడర్స్ చెలరేగిపోయారు. మళయాళం హీరోయిన్ ప్రియా వారియర్ కన్ను కొట్టిన సందర్భాన్ని కొందరు తమ ట్వీట్లలో గుర్తు చేశారు. దీనికి కొనసాగింపు అన్నట్లుగా అన్ని పత్రికలు ఆ చిత్రాన్ని ప్రచురించాయి. అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో మాట్లాడిన రాహుల్ ... తన ప్రసంగం పూర్తి అయిన తర్వాత మోడీ చైర్ వద్దకు వెళ్లి ఆయన్ను హత్తుకున్నారు. దీంతో సభలో ఉన్నవారంతా స్టన్ అయ్యారు. ఆ వార్తే ఇవాళ అన్ని ప్రధాన పత్రికల్లో బ్యానర్ ఐటమ్‌గా ప్రచురించారు. మోడీని ఆలింగనం చేసుకుంటున్న ఫోటోను ప్రింట్ చేశాయి. మోడీని కౌగిలించుకుని వెళ్లిన తర్వాత తన చైర్ లో కూర్చుకున్న రాహుల్ తమ సభ్యులతో మాట్లాడుతూ కన్ను కూడా కొట్టారు. ఆ కన్ను కొట్టే ఫోటోలను కూడా వార్తపత్రికలు ప్రధానంగా ప్రచురించాయి.