బ్రిటన్ కు చెందిన ఆక్స్ ఫర్డ్ వర్సిటీ డెవలప్ చేసిన వ్యాక్సిన్ కు సంబంధించి తాజాగా వెలువడిన అప్డేట్స్ ప్రపంచానికి ఒకింత భరోసాను పెంచటమే కాదు.. భయాన్ని కాస్తంత తగ్గించాయనే చెప్పాలి. ఒకట్రెండు దశల్లో నిర్వహించిన హ్యుమన్ ట్రయల్స్ కు సంబంధించిన ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటమే కాదు.. తర్వాతి దశల్ని ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా ఉండటంపై హర్షం వ్యక్తమవుతోంది. మొదటి నుంచి ఆక్స్ ఫర్డ్ చేస్తున్న పరిశోధనలపై ప్రపంచం పెట్టుకున్న ఆశల్ని వమ్ము చేయలేదనే చెప్పాలి.
తాజాగా మూడో దశ హ్యుమన్ ట్రయల్స్ లో భాగంగా తాము డెవలప్ చేసిన వ్యాక్సిన్ భారత్ లోనే ప్రయోగించనున్నారు. ఇందులో భాగంగా పూనెకు చెందిన సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో జత కట్టనున్నారు. దేశంలో జరిపే హ్యుమన్ ట్రయల్స్ లో కీలక పాత్ర పోషించే సీరమ్.. అనంతరం వ్యాక్సిన్ ప్రయోగాలు సక్సెస్ అయిన పక్షంలో ప్రొడక్షన్ చేయటంలోనూ కీలక పాత్ర పోషించనుంది.
హ్యుమన్ ట్రయల్స్ కు సంబంధించి సీరిమ్ సంస్థ ఇప్పటికే అనుమతుల కోసం అప్లై చేసుకున్నట్లు చెబుతున్నారు. ఒకసారి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినంతనే పరీక్షల్ని నిర్వహించన్నారు. ఆక్స్ ఫర్డ్ వర్సిటీ డెవలప్ చేసిన వ్యాక్సిన్ ప్రయోగాల కోసం సీరమ్ సంస్థ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. ఆక్స్ ఫర్డ్ సంస్థ చేస్తున్న ప్రయోగాలు సరైన దారిలోనే నడుస్తున్నాయని చెబుతున్నారు. అయితే.. రానున్న రోజుల్లోనూ ఇదే తీరుతో సాగితే.. ప్రపంచ మానవాళిని కరోనా ముప్పు నుంచి తప్పిస్తుందని చెప్పక తప్పదు.