కరోనా సమయంలో ఎక్కడ చూసినా హృదయ విదారకర దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇలాంటి కష్ట కాలంలోనూ కొందరు సమాజ సేవ చేస్తున్నారు. తోటి వారి ప్రాణాలు కాపాడేందుకు దేనికైనా తెగిస్తున్నారు. అలాంటి కోవలోకే వస్తారు ఝార్ఖండ్ కు చెందిన దేవేంద్ర. తన ఫ్రెండ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసి, అందరిలా అయ్యో అంటూ బాధపడుతూ కూర్చోకుండా ఓ పెద్ద ప్రయత్నమే చేశారు. తన మిత్రుడి కోసం ఏకంగా ఝార్ఖండ్ లోని బొకారో నుంచి యూపీలోని నోయిడాకు ఆక్సీజన్ సిలిండర్ తీసుకెళ్లారు. సరైన సమయానికి మిత్రుడికి ఆక్సిజన్ అందించి తన మిత్రుడి ప్రాణాలు కాపాడుకున్నాడు.
38 ఏళ్ల దేవేంద్ర బొకారోలో స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నారు. ఆయన ఫ్రెండ్ రంజన్ అగర్వాల్ ఢిల్లీలో ఐటీ జాబ్ చేస్తున్నారు. ఇటీవలే రంజన్ ఫ్యామిలీ కరోనా బారినపడింది. నోయిడాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే , రంజన్ అగర్వాల్ కు శ్వాస ఆడక ఇబ్బందులు పడుతున్నారు. ఆక్సిజన్ సిలిండర్ కోసం ఎంత ప్రయత్నించినా దొరకలేదు. ఈ విషయం దేవేంద్రకు తెలిసింది. తాను స్టీల్ ప్లాంట్ ఉన్న బొకారాలోనే ఉంటున్నారు. ఆ స్టీల్ ప్లాంట్ నుంచి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా జరుగుతోంది. ఎలాగైనా తన ఫ్రెండ్ ఫ్యామిలీ కోసం ఆక్సిజన్ సిలిండర్ సాధించాలని ప్రయత్నించారు దేవేంద్ర. అతి కష్టం మీద సిలిండర్ తీసుకోని ఆదివారం మధ్యాహ్నం తన కారులో బొకారో నుంచి నోయడాకు బయలుదేరారు దేవేంద్ర.
మొత్తు మూడు రాష్ట్రాల మీదుగా 1440 కి.మీ. ప్రయాణించి చివరకు సోమవారం మధ్యాహ్నం ఆస్పత్రికి చేరుకున్నారు. సకాలంలో ఆక్సిజన్ అందడంతో రంజన్ ప్రాణాలతో బయటపడ్డారు.దేవేంద్ర కారులో ఆక్సిజన్ సిలిండర్ తరలిస్తున్న క్రమంలో బీహార్‌లో ఒకసారి, యూపీలో మరొకసారి పోలీసులు ఆపారు. ఈ ఆక్సిజన్ ఎక్కడిది, ఎక్కడికి తీసుకెళ్తున్నావు, బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నావా, అంటూ ప్రశ్నలు గుప్పించారు. తన మిత్రుడు పరిస్థితిని వివరించి చెప్పడంతో వాళ్లు కూడా మానవతా కోణంలో అలోచించి వదిలేశారు. ఏదేమైనా కరోనా వ్యాప్తి భయంకరంగా ఉన్న ఈ సమయంలో ఓ మిత్రుడి కోసం ఆక్సిజన్ సిలిండర్ తీసుకోని ఝార్ఖండ్ లోని బొకారో నుంచి యూపీలోని నోయిడా కి ప్రయాణం చేసాడు అంటే నిజంగా దేవుడే అని చెప్పాలి. ఈ విషయం గురించి తెలుసుకున్న వారందరు కూడా అందరికి ఇలాంటి ఓ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది అని అతని పై ప్రసంశలు కురిపిస్తున్నారు.