బెయిల్ వచ్చినా.. తంబి జైల్లోనే ఉండాలా?

Update: 2019-10-22 07:08 GMT
ఎట్టకేలకు కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి కొంత ఊరట లభించింది. కేసుల మీద కేసులతో ఉక్కిరిబిక్కిరి కావటమే కాదు.. యూపీఏ ప్రభుత్వాల్లో కీలక భూమిక పోషించిన ఆయన చివరకు తీహార్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. బెయిల్ కోసం చాలానే ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది.  ఎట్టకేలకు ఆయన వినతిని సుప్రీంకోర్టు ఓకే చేసి బెయిల్ మంజూరు చేసినట్లు తెలిపింది.

ఐఎన్ ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో ఇప్పటికే పలు చిక్కుల్లో చిక్కుకున్న చిదంబరం మాస్టారు.. చివరకు తాను సీబీఐ దర్యాప్తునకు సహకరిస్తానని.. వ్యక్తిగతంగా అందుబాటులో ఉంటానని కోర్టుకు చెప్పటంతో ఆయన రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిల్ మంజూర్ చేసింది. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఆయన తీహార్ జైల్లో మరింత కాలం ఉండాల్సిన పరిస్థితి.

ఎందుకంటే.. ఆయనపై సీబీఐ దాఖలు చేసిన కేసులోనే బెయిల్ మంజూరైంది. ఇదే అంశానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఆయన్ను ఈడీ విచారిస్తోంది. దీంతో.. ఈ నెల 24 వరకూ ఈడీ కస్టడీలో ఉండాల్సిందే. దీంతో.. ఈడీ కస్టడీ సమయం ముగిసే వరకూ ఆయన తీహార్ జైల్లోనే ఉండాల్సి ఉంటుంది.


Tags:    

Similar News