అమరావతి రైతులకు తీపికబురు వచ్చేసినట్లే. ఎన్నో సందేహాలు.. మరెన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతూ.. రాజధాని కోసం తమకు తాముగా భూములు ఇచ్చేసిన వారికి ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫ్లాట్ల వ్యవహారం ఎప్పుడు తేలుతుందో అర్థం కాక కిందామీదా పడుతున్న పరిస్థితి. అదే సమయంలో.. ప్రభుత్వం నుంచి కూడా ఈ విషయంపై ఎలాంటి స్పష్టత రాని నేపథ్యంలో తమ భూములకు బదులుగా ఇవ్వాల్సిన ఫ్లాట్లను ఎప్పుడు కేటాయిస్తారో తెలీని అయోమయంలో ఉన్నారు.
ఇలాంటి పరిస్థితిని మార్చాలన్న ఆలోచనలో ఉన్న ఏపీ సర్కారు తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది. మార్చి 31న లాటరీ పద్ధతిలో రాజధాని ప్రాంత రైతులకు ఫ్లాట్ల కేటాయింపులు చేయనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ఏపీ రాజధాని అమరావతి కోసం రైతులు తమకు తాము స్వచ్ఛంగా భూములు ఇచ్చిన వారికి ప్రభుత్వం పేర్కొన్న దామాషా పద్ధతిలో ఫ్లాట్లను కేటాయించనున్నారు. కీలకమైన ఫ్లాట్ల ప్రకటన నేపథ్యంలో అమరావతి రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.