ఫర్లేదు.. నారాయణ కూడా మాట్లాడుతున్నారే

Update: 2015-06-29 05:31 GMT
ఓటుకు నోటు అంశం కానీ.. ట్యాపింగ్‌ ఉదంతం పై కావొచ్చు.. సెక్షన్‌ 8 అంశంపైనా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రచ్చ.. రచ్చ అయిపోతే.. నేతలు మాటల తూటాలు విసురుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సమయంలోనూ కొందరు నేతలు ఆచితూచి  వ్యవహరిస్తూ.. విమర్శలు చేసే విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉంటున్నారు. అలాంటి ఆంధ్రా నేతల విషయానికి వస్తే.. ఏపీ ముఖ్యమంత్రికి రైట్‌హ్యాండ్‌గా అభివర్ణించే మంత్రి నారాయణ.

పలు విద్యా సంస్థల అధిపతిగా.. మంత్రిగా తనకున్న పరిమితుల కారణంగా కావొచ్చు.. ఈ మధ్యన వివాదం అయిన ఏ ఒక్క అంశంపైనా ఆయన తన వాదనను బలంగా వినిపించింది లేదు. అలాంటి ఆయన.. తాజాగా నోరు తెరిచారు. సెక్షన్‌ 8పై కేసీఆర్‌ తీరును విమర్శించారు. అనవసర రార్దాంతం చేస్తున్నారని విమర్శించారు. సెక్షన్‌ 8పై అభ్యంతరం వ్యక్తం చేయటం అర్థం లేని పనిగా అభివర్ణించిన నారాయణ.. విభజన చట్టం చేసేటప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

విభజన చట్టాని యథాతదంగా.. అన్ని క్లాజుల్ని పక్కాగా అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. ఎప్పుడూ లేనిది.. నారాయణ ఎందుకు నోరు విప్పినట్లు? అధినేత మీద విమర్శలు వస్తేనే స్పందించని ఆయన.. సెక్షన్‌ 8 మీద వివాదం రాజుకున్న ఇన్నాళ్లకు నోరు విప్పటంలో ఏమైనా రాజకీయం ఉందా నారాయణ?

Tags:    

Similar News