తెలంగాణ మంత్రులందరి దారి ఒకటైతే.. ఎక్సైజ్ శాఖామంత్రి పద్మారావు తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. ఆయన జెట్ స్పీడ్ తో నిర్ణయాలు తీసేసుకుంటారు. ఏదైనా విషయం మీద క్షణాల్లో రియాక్ట్ అయ్యే ఆయన ఉత్సాహం చూసినోళ్లు ఎవరైనా షాక్ తినాల్సిందే. తాజాగా అలాంటి స్పందనే చూపించి అందరి దృష్టిని ఆకర్షించారు.
నల్గొండ జిల్లాకు ఆకస్మిక తనిఖీల కోసం వెళ్లిన తెలంగాణ మంత్రి పద్మారావు దృష్టికి ఒక గుడుంబా అమ్మే మహిళ కలిశారు. ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడిన మంత్రి.. గుడుంబా అమ్మటం నేరం కదా? అని ప్రశ్నించటంతోపాటు.. అలా చేస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో.. ఆమె తన కష్టాల్ని చెప్పటమే కాదు.. ఏదైనా వ్యాపారం చేయాలంటే డబ్బులు కావాలని.. తన దగ్గర అంత డబ్బు లేదని చెప్పుకొచ్చింది.
అంతే.. మరో ఆలోచన లేకుండా రియాక్ట్ అయిన మంత్రి పద్మారావు తన దగ్గరున్న రూ.50వేలను సదరు మహిళకు ఇచ్చి.. ఆ డబ్బుతో ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలని.. గుడుంబా మాత్రం అమ్మకూడదని ఒట్టు వేయించుకున్నారు. ఊహించని ఈ పరిణామానికి సదరు మహిళ మాత్రమే కాదు.. అధికారులు.. స్థానికులు అవాక్కయ్యారు. ఈ తరహా రియాక్షన్ మంత్రి పద్మారావుకే సొంతం.