రాష్ట్రప‌తికి ఆశీస్సులు అందించిన తిమ్మ‌క్క‌!

Update: 2019-03-17 05:52 GMT
ప‌ద్మ అవార్డుల పుర‌స్కారం కోసం రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌టం.. దీనికి ప్ర‌ధాని మోడీ మొద‌లుకొని ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతుంటారు. తాజాగా నిర్వ‌హించిన ప‌ద్మ పుర‌స్కారాల సంద‌ర్భంగా చోటు చేసుకున్న రెండు సంఘ‌ట‌న‌లు భ‌విష్య‌త్తులో పున‌రావృతం కావేమో?
ప‌ద్మ పుర‌స్కారాల్ని ఏన్నో ఏళ్లుగా అందిస్తున్నా ఒకే వ్య‌క్తికి సంబంధించి రెండు ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మార‌ట‌మే కాదు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. చివ‌ర‌కు రాష్ట్రప‌తి సైతం ట్విట్ట‌ర్ లో స్పందించ‌టం గ‌మ‌నార్హం. ఇంత‌కీ జ‌రిగిందేమంటే..

ప‌ద్మ పుర‌స్కారాల ప్ర‌దానోత్స‌వం కార్య‌క్ర‌మం శ‌నివారం రాష్ట్రప‌తి భ‌వ‌న్  చోటు చేసుకుంది. ఈ సంద‌ర్భంగా క‌ర్ణాట‌క‌లో అంద‌రూ ఎంతో గౌర‌వంగా.. ప్రేమ‌గా వృక్ష‌మాతెగా పిలుచుకునే  107 ఏళ్ల సాలుమ‌ర‌ద తిమ్మ‌క్క ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాన్ని అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె సంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో దుస్తులు ధ‌రించి రావ‌ట‌మే కాదు.. కాళ్ల‌కు చెప్పులు లేకుండానే పుర‌స్కారానికి అందుకోవ‌టానికి వేదిక మీద‌కు వ‌చ్చారు.

ఈ వైనం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఇదొక ఎత్తు అయితే.. రాష్ట్రప‌తి చేతుల మీద ప‌ద్మ పుర‌స్కారాన్ని అందుకున్న అనంత‌రం  తిమ్మ‌క్క రాష్ట్రప‌తిని ఆశ్వీర‌దించారు. వాస్త‌వానికి అలా చేయ‌టం ప్రోటోకాల్ కు వ్య‌తిరేకం. అయిన‌ప్ప‌టికీ వ‌య‌సులో అంత పెద్ద‌దైన ఆమె.. రాష్ట్రప‌తి కూడా త‌ల్లిలా ఆశీస్సులు అందించ‌గా.. ఆయ‌న విన‌మ్రంగా స్వీక‌రించారు. ఈ స‌న్నివేశాన్ని చూసిన ప్ర‌ధాని మోడీ మొద‌లుకొని ద‌ర్బార్ హాల్లో ఉన్న స‌భికులు పెద్ద పెట్టున హ‌ర్ష‌ధ్వానాలు వ్య‌క్తం చేశారు.

దీనిపై రాష్ట్రప‌తి కోవింద్ స్వ‌యంగా రియాక్ట్ అయ్యారు. పుర‌స్కారాల కార్య‌క్ర‌మం ముగిసిన త‌ర్వాత ఆయ‌న ట్విట్ట‌ర్ లో ఒక ట్వీట్ చేశారు. ప‌ద్మ అవార్డుల ప్ర‌దానోత్స‌వంలో ఉత్త‌ములైన‌.. అర్హులైన వారిని గౌరవించ‌టం రాష్ట్రప‌తికి ద‌క్కే అరుదైన అవ‌కాశం. కానీ.. ఈ రోజు క‌ర్ణాట‌క‌కు చెందిన ప‌ర్యావ‌ర‌ణ ఉద్య‌మ‌కారిణి.. ప‌ద్మ అవార్డు గ్ర‌హీత‌ల్లో అత్యంత వ‌యోవృద్ధురాలు సాలుమ‌ర‌ద తిమ్మ‌క్క న‌న్ను ఆశీర్వ‌దించ‌టం.. న‌న్ను క‌దిలించివేసింది. ఆమె ఆశీర్వాదానికి అర్హుడ్ని. సాధార‌ణ భార‌తీయుల‌కు ముఖ్యంగా ధైర్యం.. ప‌ట్టుద‌ల‌.. నిరంత‌రం శ్ర‌మించే గుణాలున్న భార‌తీయ మ‌హిళ‌ల‌కు తిమ్మ‌క్క ప్ర‌తినిధి అంటూ ఆయ‌న త‌న ఆనందాన్ని ట్వీట్ రూపంలో కోట్ చేశారు. ఇక‌.. తిమ్మ‌క్క విష‌యానికి వ‌స్తే గ‌డిచిన 65 ఏళ్ల‌లో ఆమె 400 మ‌ర్రిచెట్లతో స‌హా 8వేల చెట్ల‌ను పెంచారు.
Tags:    

Similar News