చంద్రబాబు రాజకీయ వారసుడు, తెలుగుదేశానికి హోల్ సేల్ గుత్త పెత్తందారు అయిన నారా లోకేష్ తన ఫ్యూచర్ ప్లాన్స్ డ్రీం అన్నీ చూసుకునేందుకు నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లు అంటూ బిగ్ టార్గెట్ తో సుదీర్ఘమైన పాదయాత్ర చేపట్టారు. నారా లోకేష్ ని తనంత నాయకుడిని చేయాలని అది తాను చూడాలని చంద్రబాబు ఆరాటం కూడా ఈ పాదయాత్ర వెనక ఉంది. లోకేష్ పాదయాత్ర మొదలెట్టి ఈ రోజుకు సరిగ్గా పదమూడవ రోజు.
అయితే పాదయాత్రకు అనుకున్నంత గా ఊపు రావడంలేదని అంతా అంటున్నారు. లోకేష్ పాదయాత్ర తొలి రోజు అదిరిపోయింది కానీ ఇపుడు మాత్రం అంతగా ప్రచారంలోకి రాకుండా ఉందని ఒక టాక్. లోకేష్ పాదయాత్రను విజయవంతం చేయడానికి తెలుగుదేశం పార్టీతో పాటు దాని అనుకూల మీడియా కూడా శాయశక్తులా కృషి చేస్తోంది. అదే టైం లో వైసీపీ అనుకూల మీడియా సోషల్ మీడియా చీల్చి చెండాడుతున్నాయి.
ఇదిలా ఉంటే లోకేష్ పాదయాత్ర విషయంలో మొదటి నుంచి అన్నీ దగ్గరుండి చూసుకోమని చంద్రబాబు అనంతపురానికి చెందిన ఎమ్మెల్సీ, జేసీ బ్రదర్స్ అల్లుడు అయిన దీపక్ రెడ్డికి కీలకమైన బాధ్యతలు అప్పగించారు. సోషల్ మీడియా వింగ్ కి జీవీ రెడ్డిని నియమించారు. ఇక ప్రచారం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో గట్టిగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. చంద్రబాబు మంగళగిరిలో ఉన్నా హైదరాబాద్ లో ఉన్నా లోకేష్ పాదయాత్రను ఎప్పటికపుడు చెక్ చేస్తూ ఏ రకమైన చర్యలు తీసుకోవాలన్న దాని మీదనే అందరితో మాట్లాడుతూ ఉన్నారు.
ఇంతలా చంద్రబాబు తపన తాపత్రయం పడుతూంటే అదే తెలుగుదేశం పార్టీకి చెందిన జేసీ బ్రదర్స్ లో పెద్దయన అయిన జేసీ దివాకరరెడ్డి పాదయాత్రలకు కాలం చెల్లిందని సడెన్ గా అనేశారు. నిజానికి ఇది చాలా పెద్ద మాట. లోకేష్ కాళ్లగిరేలా తిరుగుతున్నారు. ఆయనకు ఇది కొత్త బాధ్యత. టఫ్ టాస్క్. ఆయన ఇంతకు ముందు నడిచినది లేదు. ఒక విధనా గోల్డెన్ స్పూన్ లో పెరిగాడు.
ఈ మధ్యలో అయినా ఆయన ఉద్యమాలు చేసి ఎంతో కొంత దూరం పాదయాత్రలు చేసినా అనుభవం వచ్చును. కానీ అలా కూడా చేయలేదు. అన్నప్రాశన నాడే ఆవకాయతో భోజనం అనేట్లుగా ఒకేసారి వేలాది కిలోమీటర్లు అంటూ లోకేష్ ఎంచుకోవడమే అతి పెద్ద రిస్క్ అయితే సొంత పార్టీ వారే పాదయాత్రల మీద అలా మాట్లాడితే ఎలా అన్నదే ఇపుడు చర్చగా ఉంది. ఇంతకీ జేసీ దివాకరరెడ్డి ఏమన్నారు అంటే ఈ రోజుల్లో పాదయాత్రలు ఏంటి అంటూ లైట్ తీసుకున్నారు. జనాలు పాదయాత్రలకు రావడం లేదు అని అంటున్నారు.
పాదయాత్రలు చేయడం వేస్ట్ అని కూడా జేసీ అనేశారు. పాదాయాత్రల కాన్సెప్ట్ కి కాలం చెల్లింది అని ఆయన ఒక్క ముక్కలో తేల్చేశారు. ఈ రోజుల్లో జనాలు పాదయాత్రను అసలు పట్టించుకోవడం లేదని కుండబద్ధలు కొట్టేశారు. తెలంగాణా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయినా నారా లోకేష్ అయినా ఇంకెవరు అయినా ఇపుడు పాదయాత్రలు చేసినా ఏమీ లాభం లేదని పెద్దాయన తనదైన శైలిలో విశ్లేషించారు.
అంతే కాదు ఆయన మరోమాట కూడా అంటున్నారు. గతంలో పాదయాత్రలు వేరు ఇపుడు వేరు అని ఒక తేడాను కూడా చెబుతున్నారు. గతంలో జనంతో పాదయాత్రలు సాగితే ఇపుడు డబ్బుతో కూడుకున్న పాదయాత్రలే సాగుతున్నాయని అంటున్నారు. అందువల్లనే జనాలు వీటిని అసలు ఎక్కడా పట్టించుకోవడం లేదని జేసీ దివాకరరెడ్డి తన అభిప్రాయాన్ని చెప్పేశారు. నిజానికి దివాకరరెడ్డి చెప్పినది చూస్తే అంతా అంగీకరించే విషయమే. ఎందుకంటే పాదయాత్రల మోజు క్రేజూ అలా నెమ్మదిగా కరిగిపోతోంది.
గతంలో జనాలు ఎదురేగి తమ వద్దకు నాయకుడిని తీసుకొచ్చేవారు. ఇపుడు అలా కాదు జనాలను డబ్బులు ఇచ్చి తోలించుకుంటున్నారు అన్న అభిప్రాయం ఏర్పడుతోంది. అదే విధంగా ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు పాదయాత్రలు అని ఎవరు బయల్దేరినా అధికారమే లక్ష్యమని జనాలు అనుకుంటున్నారు. దాంతో తమ కోసం కానీ ఈ రాజకీయ పాదయాత్రలను తాము ఎందుకు పట్టించుకోవాలి అన్నది వారికీ ఉంది.
ఈ రోజు జేసీ ఈ మాటలు అన్నా దీని కంటే ముందే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఇలాగే చెప్పారు. జగన్ చేసినదే చివరి పాదయాత్ర అని ఆయన అన్నారు. ఇక మీదట ఎవరు చేసినా ఫలితాలు రావు అని ఉండవల్లి కూడా చెప్పారు. సో ఉండవల్లి ఎలా చెప్పినా ఓకే కానీ తెలుగుదేశంతో ఉంటూ పెద్దాయన ఇలా నారా లోకేష్ పాదయాత్ర మీద కామెంట్స్ చేశారంటే తెలుగుదేశం వర్గాలు ఎలా చూస్తాయో అన్నదే చర్చ. పైగా ఆయన తమ్ముడి అల్లుడే ఈ పాదయాత్ర వెనక సారధిగా ఉన్నారు. మరి జేసీ చేసిన ఆ కామెంట్స్ తెలుగుదేశంలో రచ్చ అయ్యేలా ఉన్నాయని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.