పాకిస్థాన్ మరోసారి తన వంకరబుద్ధిని చాటుకుంది. గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్ జైళ్లో బందీగా ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ కు భారతీయ లాయర్ ను పెట్టలేమంటూ తేల్చి చెప్పింది. కులభూషణ్ జాదవ్ ను పాక్ చెరనుంచి విడిపించేందుకు కొంత కాలంగా భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జాదవ్ తరఫున వాదించేందుకు భారతీయ లాయర్లకు అనుమతి ఇవ్వాలని భారతవిదేశాంగ శాఖ విజ్ఞప్తి చేసింది. కానీ కుటిల బుద్ధిని ప్రదర్శించిన పాక్.. ఈ ప్రతిపాదనను తోసిపుచ్చింది. ఇదిలా ఉండగా ఆదేశ విదేశాంగ ప్రతినిధి జహీద్ హఫీజ్ మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కారు. ‘ జాదవ్ కేసు విషయం లో భారత్ అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. తమ న్యాయవ్యవస్థనే శంకిస్తోంది. భారత్ పెట్టే అర్థంలేని డిమాండ్లను తాము పట్టించుకోం. పైగా భారత్ మా కోర్టులను గౌరవించడం లేదు. వారి ప్రతిపాదనలను అంగీకరించే ప్రసక్తే లేదు’ అని హఫీజ్ పేర్కొన్నారు
పాక్మీడియాలో తప్పుడు వార్తలు
జాదవ్ తరఫున న్యాయవాదిని నియమించుకొనేందుకే గతంలోనే పాకిస్థాన్ అవకాశం కల్పించింది.. కానీ ఆ అవకాశాన్ని భారత్ వినియోగించుకోలేదని పాకిస్థాన్ మీడియా తప్పుడు వార్తలు ప్రసారం చేసింది. అయితే తమకు అటువంటి సమాచారం ఏదీ రాలేదని భారత్ స్పష్టం చేసింది.
కేసు పూర్వాపరాలు..
ఈ కేసును విచారించిన ఇస్లామాబాద్ హైకోర్టు.. జాదవ్ కేసు లో న్యాయవాదిని నియమించుకొనేందుకు అవకాశం కల్పించాలని పాకిస్థాన్ ప్రభుత్వానికి ఆదేశించింది. భారత్ కు ఆ మేరకు సమాచారం అందించాలని కూడా కోరింది. తదుపరి విచారణను అక్టోబర్ 3కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో న్యాయవాది నియామకం కోసం భారత్.. పాక్ కు విజ్ఞప్తి చేయగా.. పాకిస్థాన్ మాత్రం కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా భారత్ ప్రతిపాదనలను తోసిపుచ్చింది. ఈ కేసుపై తొలి నుంచి అనేక వివాదాలు నెలకొని ఉన్నాయి. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొన్న జాదవ్‌కు పాకిస్థాన్ కోర్టు మరణదండన విధించగా.. భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించి మరణదండనపై స్టే తీసుకొచ్చింది.