భారత్ కు అల్లుడు కానున్న పాక్ క్రికెటర్

Update: 2019-07-31 04:58 GMT
ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పుణ్యమా అని భారత్ కు పాక్ క్రికెటర్  అల్లుడైన వైనం తెలిసిందే. తాజాగా మరో పాక్ క్రికెటర్ భారత్ కు అల్లుడవుతున్నాడు. పాకిస్థాన్ క్రికెట్ జట్టులో పేస్ బౌలర్ గా సుపరిచితుడైన హసన్ అలీ భారత్ కు చెందిన అమ్మాయిని పెళ్లాడనున్నారు. హర్యానాకు చెందిన షమీమా అర్జూను అతను పెళ్లి చేసుకోనున్నారు.

ఆగస్టు 20న వీరి వివాహం దుబాయ్ లో జరగనుంది. ఇంతకీ ఈ షమీమా ఎవరు?  ఎక్కడ ఉంటారు?  ఏం చేస్తుంటారన్న విషయాల్ని చూస్తే.. ఆమె ప్రస్తుతం దుబాయ్ లో స్థిరపడింది. భారత్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమె పైచదువుల కోసం ఇంగ్లండ్ వెళ్లింది. అక్కడే ఫ్లైట్ ఇంజనీర్ గా ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం చేస్తోంది.

కొంతకాలం క్రితం హసన్ తో ఆమె పరిచయం స్నేహంగా మారి.. ప్రస్తుతం పెళ్లి పీటలవైపు నడిచేలా చేసింది. పెళ్లి విషయమపై తాజాగా స్పందించాడు హసన్ అలీ.  పెళ్లి సంగతి నిజమే కానీ.. ఇంకా డేట్ డిసైడ్ కాలేదన్నాడు. పెళ్లి పనులు మొదలయ్యాయయని.. దుబాయ్ లోని అట్లాంటిస్ పామ్ హోటల్లో పెళ్లి వేడుక జరగనుందని చెప్పాడు. వీరి పెళ్లి జరిగితే భారత మహిళను పెళ్లాడిన నాలుగో పాక్ క్రికెటర్ గా నిలుస్తాడు.

గతంలో జహీర్ అబ్బాస్.. మోసిన్ ఖాన్.. షోయబ్ మాలిక్ లు భారత అమ్మాయిల్ని పెళ్లాడారు. తాజాగా వీరి పెళ్లితో భారత్ కు పాక్ క్రికెటర్ అల్లుడిగా మారనున్నాడు. వీరి పెళ్లి ముచ్చటపై ఇప్పుడు అందరి చూపు పడేలా చేస్తుందని చెప్పక తప్పదు. 
Tags:    

Similar News