పాకిస్థాన్ లో విమాన ప్రమాదం జరిగింది. పాకిస్తాన్ లోని కీలక నగరమైన కరాచీలో ఓ విమానం కుప్పకూలింది. కరాచీలోని నివాస ప్రాంతంలో విమానం కుప్పకూలిన విషయాన్ని అంతర్జాతీయ మీడియా ధృవీకరించింది. కరాచీ విమానాశ్రయంలో శుక్రవారం మధ్యాహ్నం విమానం ల్యాండింగ్ అవడానికి ఒక్క నిమిషం ముందు కూలిపోయింది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం లాహోర్ నుంచి కరాచీకి వస్తుండగా - విమానాశ్రయానికి చేరడానికి నిమిషం ముందే మలీర్ లోని మోడల్ కాలనీ సమీపంలో జిన్నా గార్డెన్ ప్రాంతంలో కూలిపోయినట్టు సీఏఏ వర్గాలు తెలిపాయి.
ప్రమాద సమయానికి విమానంలో 99 మంది ప్రయాణికులు సహా 107 మంది ఉన్నట్టు సీఏఏ వర్గాలు తెలిపాయి. విమానాశ్రయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే విమానం కూలిపోవడం గమనార్హం. విమానం కూలిపోయిన తర్వాత మంటలు వ్యాపించి - ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలముకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానం జనావాసాల మధ్యలో కూలిపోవడంతో ప్రాణనష్టం భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. విమానంలోని ప్రయాణికులు ప్రాణాలతో బయటపడే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది