ఇండియ‌న్ ఆర్మీపై పాక్ కండ‌కావ‌రం

Update: 2015-07-15 16:08 GMT
భారతదేశం ప‌ట్ల రెచ్చ‌గొట్టే చ‌ర్య‌లను  పాకిస్తాన్ కొన‌సాగిస్తోంది. నియంత్రణ రేఖ దాటి తమ గగనతలంలోకి వచ్చిందంటూ పాక్ బలగాలు భార‌త గూఢచార డ్రోన్‌ను కూల్చివేశాయి. ఈమేర‌కు ఒక అంత‌ర్జాతీయ ప‌త్రిక‌ డోన్‌ను కూల్చివేసిన చిత్రాలు కూడా పొందుపరిచింది. అయితే భార‌త దేశం ఈ విష‌య‌మై అధికారికంగా ఏమీ స్పందించ‌లేదు.

ఇప్ప‌టికే ప‌లుమార్లు కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇటీవ‌లే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోడీ సమావేశమై నియంత్ర‌ణ రేఖ‌, ఆక్ర‌మిత క‌శ్మీర్‌,  ద్వైపాక్షిక చ‌ర్చ‌ల గురించి ఒక కొలిక్కి తీసుకువ‌చ్చిన‌ తర్వాత ఈ ఘటన జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరు దేశాల ప్ర‌ధాన‌మంత్రుల చ‌ర్చ‌లు జ‌రిగిన నేప‌థ్యంలో స‌మ‌స్య‌ను ప‌రిష్కారం అవుతుందని ఆయా దేశాల పౌరుల‌తో పాటు...ప్ర‌పంచ దేశాలు కూడా భావిస్తున్న నేప‌థ్యంలో పాక్ దుశ్చ‌ర్య‌లు ఆ ఆశల‌ను భ‌గ్నం చేసే విధంగా ఉన్నాయ‌ని ప‌లువురు భావిస్తున్నారు.
Tags:    

Similar News