పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్ చూసి ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ వంటి సంస్థలకు దిమ్మతిరిగిపోయింది. ఏ దేశంలో లేని విధంగా పాక్ప్రభుత్వం విచిత్రమైన ఆంక్షలు విధిస్తున్నదని వారు వాపోతున్నారు. నిబంధనల విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఇలాగే మొండిగా ముందుకు పోతే .. తాము పాకిస్థాన్‌లో ఉండలేమని ఆయా సంస్థలు తేల్చిచెబుతున్నాయి. ఇటీవల పాకిస్థాన్ సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ ప్రివెన్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ క్రైమ్ యాక్ట్ 201(PECA) కింద కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ నిబంధనలు ఎంతో కఠినంగా ఉన్నాయి. ఈ నిబంధనల ప్రకారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్ని అంశాలు ISP(ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు) వర్తింపచేయబడ్డాయి. ఇది టెక్ దిగ్గజాలకు ఆగ్రహం కలిగించింది.
పాకిస్థాన్ తీసుకొచ్చిన నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని.. వీటిని ఇలాగే కొనసాగిస్తే మేము పాకిస్థాన్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిపేస్తామని ఆసియా ఇంటర్నెట్ కొలేషన్ (ఏఐసీ) హెచ్చరించింది. ఏఐసీలో ఫేస్‌బుక్, గూగుల్, ట్విట్టర్ సహా మరికొన్ని సంస్థలు ఉన్నాయి. పాకిస్థాన్ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. సోషల్ మీడియాలో మతం, ఉగ్రవాదం, అశ్లీలం, విద్వేషాలు రెచ్చగొచ్చే ప్రసంగాలు రావడానికి వీల్లేదు. వీటిపై పాకిస్థాన్‌కు చెందిన ఓ అధికార యంత్రాగం నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సోషల్‌మీడియా సంస్థలు ఈ నిబంధనలు ఉల్లంఘించారంటే 3.14 మిలియన్ డాలర్ల జరిమానా విధిస్తారు.
మరోవైపు ప్రభుత్వం అడిగిన వెంటనే సోషల్‌మీడియా సంస్థలు తమవద్ద ఉన్న సమాచారాన్ని అందించాలి. ప్రభుత్వం అభ్యంతరం చెప్పిన పోస్టులను 24 గంటల్లోనే తొలగించాలి. 50 వేలు అంతకంటే ఎక్కుగా ఉన్న యూజర్లు ఉన్న సంస్థలు పాక్ టెలికమ్యూనికేషన్ అథారిటీలో రిజిస్టర్ చేసుకోవాలి.
ఇస్లామాబాద్‌లో శాశ్వతంగా ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలి.అయితే ఈ రూల్స్‌పై సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇది వ్యక్తుల భావప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమని వాళ్లు వాదిస్తున్నారు. దీనిపై పాకిస్థాన్ సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు.