పసిబిడ్డల తల్లి సూసైడ్ బాంబర్ గా ఎందుకు మారింది?

Update: 2022-04-27 14:53 GMT
చైనా కుయుక్తులను అన్ని దేశాలు ఖండిస్తున్నాయి. కానీ అది మాత్రం తన పని తాను చేసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే దాని ఉద్దేశాలను ఎవరు కూడా సరైనవి కావని చెబుతారు. పాక్ లో నూతనంగా చేపట్టబోయే ప్రాజెక్టులకు స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చినా చైనా తన పని ఆపడం లేదు. ఫలితంగా అక్కడి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పాక్ ప్రభుత్వం సైతం చైనాకు వత్తాసు పలకడంతో మంగళవారం మానవబాంబు దాడి జరిగింది. అయితే ఈ దాడి చేసింది మాత్రం ఓ మహిళ కావడం గమనార్హం. ఆమె ఉన్నత విద్యావంతురాలు. విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన ఆమె జువాలజీలో మాస్టర్ డిగ్రీ చేసింది. ఎంఫిల్ కూడా పూర్తి  చేసి ఉపాధ్యాయురాలిగా కొనసాగుతోంది.

కరాచీ యూనివర్సిటీ లో జరిగిన మానవబాంబు దాడిలో షారీ బలోచ్ (30 ) అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె ఇద్దరు పిల్లల తల్లి. తండ్రి లెక్చరర్, భర్త డెంటిస్టు. కానీ ఆమె ఎందుకు తన ప్రాణాలు తీసుకుందో అందరికి తెలిసిందే. చైనా దురాగాతాలను ఎండగట్టే క్రమంలో ఆమె ప్రాణాలనే ఆత్మాహుతి చేసుకుంది. దీంతో ఆమె భర్త ఆమె త్యాగాలు వృథాగా పోవని ఓ పోస్టు పెట్టడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. ఈమె ఎనిమిదేళ్ల క్రితం మజీద్ బ్రిగేడ్ లోని ఆత్మాహుతి దళంలో చేరినట్లు తెలుస్తోంది.

చైనా సామ్రాజ్య విస్తరణ కాంక్షతోనే ఇదంతా చేస్తుందని ఆమె నమ్మారు. అందుకే చైనాకు బుద్ధి చెప్పాలను ఉద్దేశంతోనే ఈ దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. బలూచ్ ప్రాంతంలో వనరులను కొల్లగొట్టడమే ప్రధానంగా చైనా కుట్రలు చేస్తోందని ఇప్పటికే పలు ఆరోపణలు వస్తున్నాయి. కానీ దీనిపై చైనా పట్టించుకోవడం లేదు. పాకిస్తాన్ సహకరిస్తోంది. దీంతోనే ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది.

దాడి అనంతరం పాకిస్తాన్ సైన్యం ఎలాంటి అడ్డంకులు లేకున్నా చైనా మాత్రం దీనిపై సీరియస్ గా నే ఉంది. మారణహోమం అనంతరం ఓ జర్నలిస్ట్ బలూచ్ ప్రాంతంలో రక్తపాతంతో కూడిన అధ్యాయం ప్రారంభమైనట్లు వార్తలు రావడంతో చైనాలో ఆందోళన పెరుగుతోంది. పాకిస్తాన్ ప్రజలు తమ పనులు చేసుకోవడానికి సహకరించడం లేదని వారికి అర్థమైపోతోంది. దీనిపై న్యాయవిచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని చైనా డిమాండ్ చేస్తోంది.

స్థానికుల నుంచి వస్తున్న వ్యతిరేకతను చైనా లెక్కలోకి తీసుకోవడం లేదు. దీంతోనే చైనీయులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాడిలో ముగ్గురు చైనా దేశస్తులు, పాక్ కు చెందిన వ్యాన్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఉగ్రవాద సమస్యకు మూలాలు తెలుసుకోవాలని చైనా పాక్ ను కోరుతోంది. మొత్తానికి చైనాకు ఓ ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. వేరే దేశంలో తమ ప్రభావం చూపితే ఫలితం ఇలాగే ఉంటుందని పాక్ దేశస్తులు గగ్గోలు పెడుతున్నారు.

https://twitter.com/alaudhli/status/1518931538519461890?s=20&t=m2wCs1likS-SVqpWls5i8g
Tags:    

Similar News