పాకిస్తాన్ గురించి ఆశ్చర్యకరమైన వార్త ఒకటి తెరమీదకు వచ్చింది. చైనా నుంచి భారీగా ఆయుధాలు దిగుమతి చేసుకొనే పాకిస్థాన్...ఇప్పుడు తన మిత్ర దేశానికి గాడిదలు ఎగుమతి చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికోసం డాంకీ డెవలప్ ప్రోగ్రామ్ అంటూ ఓ భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది కూడా! చైనా నుంచే పెట్టుబడులను ఆకర్షించి.. తమ దేశంలో గాడిదలను వృద్ధి చేసి మళ్లీ అదే దేశానికి ఎగుమతి చేయాలన్నది పాక్ ఆలోచన.
ఖైబర్-పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ను ఇప్పటికే గాడిదల అభివృద్ధి కోసం పాక్ ఎంపిక చేసుకుంది. స్థానిక కరెన్సీ ప్రకారం సుమారు వంద కోట్ల (రూ.61 కోట్లు) విలువైన గాడిదలను చైనాకు ఎగుమతి చేయడమే పాక్ లక్ష్యంగా పెట్టుకుంది. గాడిదల చర్మాన్ని మందులతోపాటు ఇతర అవసరాల కోసం వాడటంతో చైనాలో వాటికి మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే తమ గాడిదల ఎగుమతి ప్రతిపాదనను చైనా ముందు ఉంచింది పాకిస్థాన్. ఈ కొత్త పెట్టుబడుల వల్ల ఖైబర్-పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని గాడిద పెంపకందారుల ఆదాయం పెరుగుతుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఈ గాడిదల కథ ఎక్కడి వరకు వస్తుందో చూడాలి మరి!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/