అప్పులు ఎక్కువై.. ఓడరేవును అద్దెకు ఇచ్చిన పాక్

Update: 2023-06-23 10:00 GMT
దాయాది పరిస్థితి ఏ మాత్రం బాగోలేదన్న సంగతి తెలిసిందే. డెవలప్ మెంట్ మీద కాకుండా భారత్ మీద పగతో రగిలిపోయే ఆ దేశం ఇప్పుడు దిక్కుమాలిన పేదరికాన్ని అనుభవించటమే కాదు.. మొత్తంగా అప్పుల్లో మునిగిపోయింది.

సమీప భవిష్యత్తులో మళ్లీ పుంజుకునే అవకాశం లేనంత దారుణంగా పాక్ ఆర్థిక పరిస్థితి ఉందన్న మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో విదేశాల్లోని ఆస్తుల్ని అమ్మటమో.. అద్దెకు ఇవ్వటమోలాంటి పనులు చేస్తూ.. ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది.

అయినప్పటికీ పాక్ ను పట్టుకున్న ఆర్థిక కష్టాలు ఒక పట్టాన విడవని పరిస్థితి. రోజులు గడుస్తున్న కొద్దీ.. పాక్ ఆర్థిక సమస్యలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. తాజాగా కరాచీ పోర్టును యూఏఈకి చెందిన ఏడీ పోర్ట్ గ్రూప్ తో కరాచీ పోర్ట్ ట్రస్ట్ ఒప్పందం చేసుకుంది.

యాభైఏళ్ల పాటు సాగే లీజు డీల్ విలువ 220 మిలియన్ పౌండ్లుగా చెబుతున్నారు. తాజా మొత్తంతో పాక్ ఆర్థిక కష్టాలు కొంతమేర తీరనున్నట్లు చెబుతున్నారు.

పాకిస్థాన్ లో అత్యంత రద్దీగా ఉండే పోర్టుల్లో కరాచీ పోర్టు మొదటిస్థానంలో నిలుస్తుంది. రాబోయే పదేళ్లలో కరాచీ పోర్టులో ఏడీ గ్రూప్ మౌలిక సదుపాయాల ఏర్పాటుతో పాటు పలు డెవలప్ మెంట్ పనుల్ని చేపట్టనుంది. యూఏఈతో చేసుకున్న ఈ ఒప్పందం పాక్ కు భారీ ఊరటగా మారుతుందన్న మాట వినిపిస్తోంది.

Similar News