భారత్‌లో పాకిస్థాన్ ఉగ్రవాదుల చొరబాటు ఇప్పటి మాట కాదు. దశాబ్దాల తరబడి భారత్ ఈ సమస్యను ఎదుర్కొంటోంది. తాజాగా ఈ చొరబాట్లు రూటు మార్చకుంటున్నాయి. ఈ చొరబాట్లు సాంకేతిక రూపు మార్చకున్నాయి. పాకిస్థాన్ స్నూపింగ్ ఏజెన్సీ ఐఎస్ ఐ మొబైల్ ఫోన్ల ద్వారా మాల్ వేర్ ఎంబడెడ్ వైరస్ లను పంపించడానికి ప్రయత్నిస్తోంది. దీని కోసం టాప్ గన్ - ఎంపీజెంకీ - వీడీజెంకీ - టాకింగ్ ఫ్రాగ్ లాంటి మొబైల్ గేమ్ లను మార్గాలుగా ఐఎస్ ఐ ఎంచుకుంటోంది. మాజీ సైనికులను లక్ష్యంగా చేసుకుని వారికి ఉద్యోగాలు - డబ్బులు ఆశ చూపిస్తూ మొబైల్స్ ద్వారా ఈ వైరస్ ను భారత్ లో వ్యాప్తి చేయడానికి ఐఎస్ ఐ ప్రయత్నిస్తోందట. ఈ వైరస్ సాయంతో భారత్ లో కీలక సమాచారం రాబట్టాలనేది ఐఎస్ ఐ లక్ష్యం.
ఐఎస్ ఐ వలలో పడి ఇలా సాఫ్ట్ వేర్ ద్వారా వైరస్ లను వ్యాప్తి చేస్తున్న మాజీ సైనిక అధికారులను భద్రతా వర్గాలు పట్టుకుంటున్నాయి. 2013 నుంచి 2016 మధ్య ఏడుగురు ఎక్స్ సర్వీస్ మెన్ లను ఏడుగురిని అధికారులు అరెస్టు చేశారు. ఇలా మొబైల్ అప్లిక్లేషన్స్ పై ఒక కన్ను వేశామని పూర్తి స్థాయిలో దీన్ని నిరోధించానికి ప్రయత్నాలు చేస్తున్నామని భద్రతాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్యూటర్ సెక్యూరిటీ పాలసీ గైడ్ లైన్స్ జారీ చేశారు. సైబర్ దాడులను సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ లను సిద్ధం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో సైబర్ చొరబాట్లను అరికట్టడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కీలక ప్రదేశాల్లో సీసీటీవీల ఏర్పాటుతో పాటు సాంకేతిక నిపుణులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మొబైల్ లోకి ఏమైనా కొత్త సాఫ్ట్ వేర్ లను డౌన్ లోడ్ చేసుకునేటప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి వైరస్ లు చొరబడకుండా యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ లను ఉపయోగించాలని ప్రభుత్వం మార్గనిర్దేశకాలు జారీ చేసింది.
అంతేకాదు హార్డ్ డిస్క్ లను ఒక చోట నుంచి మరో చోటకు తరలించేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, పెన్ డ్రైవ్ లతోనూ జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. మొయిల్స్ ను క్లిక్ చేసేటప్పుడు అవి ఎలాంటి మొయిల్సో చెక్ చేసుకోవాలని సూచిస్తోంది.