వీకెండ్ వస్తే చాలు రోడ్లు అన్నీ బిజీబిజీగా మారిపోతాయి. మహా నగరాల్లోనే కాదు.. ఒక మోస్తరు సిటీల్లోనూ ఇలాంటి పరిస్థితే. అయితే.. మిగిలిన వీకెండ్ మాదిరి ఈ శనివారం ఉండదనటంలో ఎలాంటి సందేహం లేదు. శనివారం రోజున మూవీ టిక్కెట్లు దొరకటం చాలా కష్టం. కానీ.. ఈ శనివారం మాత్రం అందుకు మినహాయింపు. సాయంత్రానికి కిక్కిరిసి ఉండే రోడ్లు ఖాళీగా ఉండటమే కాదు.. సినిమా థియేటర్లలో కూడా టిక్కెట్లు చాలా ఈజీగా దొరికేయటం ఖాయం.
ఇలాంటి పరిస్థితి ఏ ఒక్క నగరానికే కాదు.. దేశ వ్యాప్తంగా అలాంటి పరిస్థితే నెలకొనటం ఖాయం. ఇంతకీ ఎందుకిలా? అన్న సందేహలు అక్కర్లేదు. ఎందుకంటే ఈ రోజు చిరకాల ప్రత్యర్థులు కమ్ దాయాదూలు మరోసారి గ్రౌండ్ లో పోటీ పడనున్నారు. ఆసియా కప్ లోని టీ20 సిరీస్ లో భాగంగా ఈ రోజు భారత్ పాక్ ల మధ్యన మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 7 గంటలకు దాయాదుల మధ్య పోరు షురూ కానుంది. దీనికి బంగ్లాదేశ్ లోని షేరే బంగ్లా నేషనల్ స్టేడియం వేదిక కానుంది.
బంగ్లాదేశ్ కు.. భారత్ కు మధ్యన సమయం పెద్దగా తేడా లేని నేపథ్యంలో దాయాదుల పోరు భారతకాలమాన ప్రకారం శనివారం రాత్రి ఏడు గంటలకు షురూ కానుంది. వీరి మధ్య పోరును ప్రత్యక్షంగా చూసేందుకు టీవీల్ని అతుక్కుపోవటం ఖాయం. కావాలంటే ఈ రోజు సాయంత్రం7 గంటల సమయంలో రోడ్ల మీదకు ఒక్కసారి వచ్చి చూడండి. లేదంటే.. మీ చుట్టుపక్కల ఇళ్లల్లో సాయంత్రం అయ్యేసరికి పెట్టిన ఛానల్స్ ఏమిటో చూస్తే ఇట్టే క్రికెట్ ఫీవర్ ఎంతలా భారత సమాజం పై ఉన్నట్లు కనిపించటం ఖాయం.
ఇక.. ఈ రెండు దేశాల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లకు సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాలు చూస్తే..
= భారత్.. పాక్ ల మధ్య ఇప్పటివరకూ టీ20 మ్యాచ్ లు ఆరు జరిగితే.. ఐదింట్లో భారత్ దే విజయం సాధించటం గమనార్హం.
= దాయాది దేశాల మధ్య జరిగిన ఆఖరి మ్యాచ్ లో భారత్ ఏడు వికెట్లతో విజయం సాధించింది.
= ఫార్మాట్ ఏదైనా భారత్ మీద పాక్ గెలిచి రెండేళ్లు అయ్యింది. 2014లో నిర్వహించిన ఆసియా కప్ వన్డే సిరీస్ లో పాక్ విజయం సాధించింది.