పాకిస్తాన్ కు చెందిన యాంకరమ్మ ఇప్పుడు మస్తు పాపులర్ అయ్యారు. ఆమె నోటి నుంచి వచ్చిన ఒక మాటతో ఆమె ఇప్పుడు వైరల్ గా మారటమే కాదు.. దేశవిదేశాల్లో అమ్మడి వీడియోను విపరీతంగా చూసేస్తూ.. నవ్వుకుంటున్నారు. కోట్లాదిమంది పెదాల మీద నవ్వులు పూయించిన అమ్మడి యాపిల్ మాట అజ్ఞానమైతే కావొచ్చు కానీ.. అందరికి భలే సరదాగా మారిందని చెప్పాలి.
కొన్ని ఉద్యోగాలు చేసే వారెంత ఒళ్లు దగ్గర పెట్టుకోవాలన్న విషయాన్ని తాజా వీడియో స్పష్టం చేస్తోందని చెప్పాలి. యాపిల్ పండుకు ప్రఖ్యాత యాపిల్ ఉత్పత్తుల సంస్థకు మధ్య తేడా గుర్తించకపోవటమే ఆమె తప్పిదంగా చెప్పాలి. పాక్ కు చెందిన ఒక టీవీ చానల్లో ప్రసారమవుతున్న షోకు హాజరైన ఆర్థిక ప్రముఖుడు ఒకరు పాకిస్తాన్ బడ్జెట్ కంటే ఒక్క యాపిల్ సంస్థ వ్యాపారమే చాలా ఎక్కువని పేర్కొన్నారు. నాన్ స్టాప్ గా మాట్లాడేస్తున్న అతగాడి మాటల్ని అలా విన్నా సరిపోయేది. యాపిల్ అన్న మాట విన్నంతనే.. అవునవును యాపిల్ పండు బిజినెస్ ఎక్కువంటూ యాంకరమ్మ అనవసరమైన రీతిలో తన అజ్ఞానాన్ని ప్రదర్శించటంతో తెల్లబోవటం ఆ అతిధి లెక్కైంది.
వెంటనే.. ఆమె మాటల్లోని తప్పును సరిదిద్దుతూ.. తాను చెబుతున్నది యాపిల్ సంస్థకన్న విషయాన్ని చెప్పటంతో.. సర్దుకున్న యాంకరమ్మ చిరునవ్వుతో కవర్ చేసే ప్రయత్నం చేసింది. అయితే.. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
తరచూ పాక్ ఆర్థిక స్థితిని యాపిల్ సంస్థ బిజినెస్ రేంజ్ తో పోల్చటం మామూలే. అయినప్పటికీ సదరు యాంకరమ్మ ఆ విషయంలో తప్పుగా అర్థం చేసుకున్నారు. యాంకరమ్మ యాపిల్ మాటలతో వైరల్ అవుతున్న ఈ 32 సెకన్ల చిట్టి వీడియోపై సోషల్ మీడియాలో ఇప్పుడు భారీగా జోకులు పేలుతున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ వీడియోను పోస్ట్ చేసింది పాత్రికేయురాలైన నైలా ఇనాయత్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో.. ఇది కాస్తా వైరల్ గా మారింది.