పాక్‌ హిందువులు భారతీయులు అయ్యారు

Update: 2015-06-27 05:43 GMT
దేశ విభజన సమయంలో పుట్టిన గడ్డను విడిచి పెట్టలేక చాలామంది పాకిస్థాన్‌లోనే ఉండిపోయారు. ఆ దేశంలో ఉండే హిందువులు తీవ్ర ఇబ్బందులకు గురి కావటం.. వారి హక్కుల విషయంలో అనే ప్రశ్నలు తలెత్తుతూ.. విభజన సమయంలో ఇండియాకు వెళ్లకుండా తప్పు చేశామన్న భావనలో ఉన్న హిందువులు వేలాదిమంది భారతదేశానికి వచ్చేయటానికి ఇప్పుడు సుముఖత వ్యక్తం చేస్తుంటారు.

అయితే.. చట్టాలు ఒప్పుకోని నేపథ్యంలో భారతపౌరసత్వం కోసం ఎదురుచూసే వారు ఎందరో. తాజాగా అలా ఎదురుచూసే కొందరికి భారత పౌరసత్వం లభించింది. పాక్‌కు చెందిన 158 మంది హిందువులకు భారత పౌరసత్వం జారీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో.. మరో 3733 మందికి దీర్ఘకాలిక వీసాలు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి వారు మరెందరో భారత్‌లో ఉండేందుకు దరఖాస్తు చేసుకొని తమకు ఎప్పుడు ఆ అవకాశం వస్తుందా? అని ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితి.

Tags:    

Similar News