వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. ఇది వాస్తవంలోకి వస్తే కొంత ఆసక్తికర
పరిణామమే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. 2004 వరకు ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు. ప్రస్తుత సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య 1999, 2004లో రెండుసార్లు గెలుపొందారు. 2009 నుంచి పాలేరు జనరల్ సీటు అయింది. సండ్ర.. సత్తుపల్లి వెళ్లిపోయారు. అక్కడి నుంచి హ్యాట్రిక్ విజయాలు సాధించారు.
రాంరెడ్డి ముద్ర.. తుమ్మల ప్రభావం
పాలేరు నియోజకవర్గం నుంచి 2009 లో రాంరెడ్డి వెంకట్ రెడ్డి పోటీ చేశారు. అప్పటివరకు ఆయన ప్రాతినిధ్యం వహించిన సుజాతనగర్ నియోజకవర్గం రద్దవడంతో రాంరెడ్డి ఇక్కడినుంచి బరిలో దిగారు. 2014లోనూ ఆయన గెలుపొందారు. పిలిస్తే పలికే వ్యక్తిగా పేరున్న నాయకుడు వెంకటరెడ్డి. అయితే, మరుసటి ఏడాదే చనిపోవడంతో 2016లో ఉప ఎన్నిక వచ్చింది.
ఆ నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీచేసి విజయం సాధించారు. తుమ్మల వాస్తవానికి ప్రజా నాయకుడు. ప్రజల్లో ఉండాలనేది ఆయన కోరిక. సీఎం కేసీఆర్ ఆయన్ను ఎమ్మెల్సీని చేసినప్పటికీ.. 2016 పాలేరు ఉప ఎన్నికలో గెలిచి తాను కోరుకున్నది సాధించారు. ఇక 2018 ఎన్నికల్లో తుమ్మల గెలుపు లాంచనమే అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఖమ్మం జిల్లా వర్గ రాజకీయాలతో ఆయన ఓడిపోయారు. ఈ విషయంలో టీఆర్ఎస్ అధిష్ఠానం ఇప్పటికీ ఖమ్మం జిల్లా నేతలపై ఆగ్రహంగా ఉంది.
అనూహ్యంగా కందాళ..
2018 ఎన్నికల్లో మహా కూటమి తరఫున కాంగ్రెస్ నుంచి పాలేరులో పోటీ చేసిన కందాళ ఉపేందర్ రెడ్డి అనూహ్యంగా తుమ్మలపై గెలుపొందారు. ఇందులో ఆయనకు టీఆర్ఎస్ నుంచి పరోక్షంగా కొందరు సహకరించారనే వాదన ఉంది. కాగా, ఉపేందర్ రెడ్డి కొద్ది రోజులకే టీఆర్ఎస్ లో చేరారు. దీంతో ప్రస్తుతం పాలేరుకు అధికార పార్టీ ఎమ్మెల్యేనే కొనసాగుతున్నట్లు లెక్క. మరోవైపు ఈ నియోజకవర్గం సంప్రదాయంగా కాంగ్రెస్ కు పట్టున్నది. వామపక్షాలు కూడా గతంలో బలంగా ఉండేవి. అలాంటిచోట నుంచి.. కాంగ్రెస్ ను తరచూ విమర్శించే షర్మిల పోటీ చేయడం పెద్దగా ఫలితాన్నిచ్చే అవకాశం ఉండదనేది పరిశీలకుల అంచనా. పాలేరులో షర్మిల గెలుపు కష్టమే అనేది మరికొందరి విశ్లేషణ.
బలంగా అన్ని పార్టీలు.. షర్మిలకు చాన్సెక్కడ?
పాలేరులో కాంగ్రెస్ బలంగా ఉంది.. కందాళ చేరికతో టీఆర్ఎస్ బాగా పుంజుకొంది.. ప్రస్తుతానికి అధికార పార్టీదే అక్కడ హవా. తుమ్మల కూడా టీఆర్ఎస్ అధిష్ఠానం ఆదేశాలతో కందాళకు సహకరించాల్సిన పరిస్థితి. వామపక్షాలది మొదటినుంచీ పాలేరులో కీలక పాత్రే. టీడీపీ తెలంగాణ వ్యాప్తంగా నామమాత్రమైనా.. పాలేరులో ఇప్పటికీ ఆ పార్టీకి స్పష్టమైన ఓటు బ్యాంకు ఉంది. అవి ఏ ఎన్నికల్లోనూ చెక్కుచెదరవు. ఇలాంటి పోటీ మధ్య షర్మిల పాలేరు నుంచి బరిలో దిగి సాధించేది ఏమీ ఉండదనేవి పరిశీలకుల భావన. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరేదైనా నియోజకవర్గాన్ని ఆమె ఎంచుకోవాల్సింది అనేది వారి భావన.