ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు వరుసగా రెండో పర్యాయం ఘోర పరాభవం ఎదురైంది. 2014లో కూడా ఈ తరహా ఓటమే ఎదురు కాగా... 2019లో ఆ ఓటమి గాఢత మరింత తీవ్రతరం కావడంతో ఏకంగా ఆ పార్టీ అధినేతగా ఉన్న యువరాజు రాహుల్ గాంధీ పదవి నుంచి దిగిపోయారు. రాహుల్ వెంట అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లు కూడా నడవడంతో ఇప్పుడు కాంగ్రెస్ లో చాలా విపత్కర పరిస్థితే నెలకొంది. ఇలాంటి తరుణంలో నవ్యాంధ్రప్రదేశ్ కు సంబంధించిన కాంగ్రెస్ బాధ్యతలను భుజానికెత్తుకునేందుకు కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఎంపీ పల్లంరాజు సిద్దమైపోయారు. ఈ మేరకు ఏపీసీపీ చీఫ్ గా పల్లంరాజును నియమించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. నేడో, రేపో ఈ నియామకానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.
పీసీసీ చీఫ్ గా పల్లంరాజు ఎంపిక వెనుక కాంగ్రెస్ పార్టీ లెక్కలు కాస్తంత ఆసక్తికరంగానే ఉన్నాయని చెప్పక తప్పదు. పల్లంరాజు ఫ్యామిలీ ఆది నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉండటంతో.. పల్లంరాజు ఎంపికపై పార్టీలో వ్యతిరేకత వ్యక్తమయ్యే పరిస్థితి లేదు. అసలు పదవులు చేపట్టేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాకుంటే... ఇక అసంతృప్తి ఎక్కడ అని ఆశ్యర్యపోవాల్సిన పని లేదు గానీ... సౌమ్యుడిగా ముద్రపడిన పల్లంరాజు ఎంపిక పట్ల దాదాపుగా పార్టీలోని అన్ని వర్గాలూ ఒక్కుమ్మడిగానే ముందుకు సాగుతాయని చెప్పాలి. ఇక కాంగ్రెస్ పార్టీతో పల్లం రాజు ప్రస్థానం విషయానికి వస్తే... పల్లంరాజు ఫ్యామిలీ ఆది నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతోంది. పల్లంరాజు తండ్రి సంజీవరావు కాకినాడ నుండే మూడు సార్లు ఎంపీగా గెలిచి..కేంద్రంలో మంత్రిగానూ వ్యవహరించారు. పల్లంరాజు సైతం మూడు సార్లు ఎంపీగా గెలిచారు. ఆయన మన్మోహన్ సింగ్ కేబినెట్ లో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పని చేసారు. రాష్ట్ర విభజన సమయంలో పార్టీ అధినాయకత్వం నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి పల్లంరాజు నమ్మిన బంటు కిందే లెక్క.
అయినా ఇప్పుడు ఏ ఒక్కరూ ఊహించనంత రీతిలో అనూహ్యంగా పల్లంరాజు పేరు తెర మీదకు రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. రాహుల్ రాజీనామాతో ఆయన బాటలో నడిచే క్రమంలో రఘువీరారెడ్డి పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సదరు పదవిని తీసుకోవాలని మెగాస్టార్ చిరంజీవికి నేరుగా రాహులే బంపర్ ఆపర్ ఇచ్చారట. అయితే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ప్రస్తుతం తాను మళ్లీ సినిమాల్లో నిమగ్నమైన తీరును బేరీజు వేసుకున్న చిరు... రాహుల్ బంపర్ ఆఫర్ ను సున్నితంగానే తిరస్కరించారట. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి చిట్ట చివరి సీఎంగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా ఈ ఆఫర్ రాగా... ఆయన కూడా చిరు బాటలోనే నడిచి తాను పీసీసీ పదవి చేపట్టలేనని తేల్చి చెప్పారట. ఈ క్రమంలోనే పల్లంరాజు పేరు తెర మీదకు వచ్చినట్టుగా తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పల్లం రాజు... కాపు నేతల్లో మంచి పేరున్న నేత కిందే లెక్క. రాష్ట్రంలో మెజారిటీ ఓటింగు ఉన్న కాపు సామాజిక వర్గానికి దగ్గర అయ్యే క్రమంలోనే పల్లంరాజు పేరును కాంగ్రెస్ పార్టీ పీసీసీ ఛీప్ పదవికి ఎంపిక చేసిందన్న వాదన కూడా వినిపిస్తోంది.