అవును.. అక్కడ పామాయిల్ కాలువలు కట్టింది. డౌట్ ఉంటే ఫోటో చూడండి. కాలువులు కట్టిన ఆ ప్రవాహం మరేమిటో కాదు.. పామాయిల్. చుట్టు బిందెలు.. గిన్నెలు పట్టుకొని.. తమ పాత్రల్లో నింపుకునే ప్రయత్నం చేస్తున్నదంతా అసలుసిసలు పామాయిలే. ఇదెలా సాధ్యమంటారా? అక్కడికే వస్తున్నాం. ఒక రోడ్డు ప్రమాదం పామాయిల్ ను కాలువలు కట్టేలా చేసిందంటే బోలెడంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
నమ్మలేనట్లుగా ఉన్న ఈ పామాయిల్ కాలువ వ్యవహారంలోకి వెళితే.. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కామేపల్లి వద్ద నెల్లూరు నుంచి హైదరాబాద్ కు వెళుతున్న పామాయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో.. పామాయిల్ కాస్త పెద్ద ఎత్తున రోడ్లను నింపేసింది. దీంతో.. ఆ పామాయిల్ ను రోడ్డు పక్కన కాలువలోకి వెళ్లింది. కాసేపటికే కాలువ మొత్తం ఆయిల్ తో నిండింది. రోడ్ల మీద పడిన పామాయిల్ నే కాదు.. కాలువలో నిండిన పామాయిల్ ను దొరకబుచ్చుకునేందుకు అక్కడి స్థానికులు పోటీ పడుతున్నారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు ఏమైనా ఎదురయ్యే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. తమ చేతుల్లో ఉన్న గిన్నెల్ని పామాయిల్ నింపుకోవటంలో బిజీ కావటం కనిపించింది. ఆశ మనిషిలోని లాజిక్ ను డామినేట్ చేస్తుందంటే ఇదేనేమో?