పల్నాడు అక్రమ మైనింగ్‌ కేసు : యరపతినేనిపై సీబీఐ కన్ను !

Update: 2020-08-22 06:15 GMT
ఏపీలో టీడీపీ నేతలకి ఏ మాత్రం కాలం కలిసి రావడం లేదు. టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా అవినీతి , అక్రమాల కేసుల్లో చిక్కుకుంటున్నారు. వైసీపీ అధికారం చేపట్టినప్పటి నుండి టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో టీడీపీ నేతల చేసిన అవినీతి , అక్రమాలపై పెద్ద ఎత్తున దర్యాప్తు  కొనసాగుతుంది. ఇకపోతే , గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ పై అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ విచారణకు గతంలోనే హైకోర్టు అనుమతించింది. దీంతో ప్రభుత్వం యరపతినేని అక్రమ మైనింగ్ కేసును సీబీఐకి అప్పగించింది. దీనితో   యరపతినేనికి అన్ని ఇబ్బందులే. సాధారణంగా యరపతినేని  తన వాణిని పార్టీ పరంగా గట్టిగా వినిపిస్తారు. కానీ , తాజా పరిణామాల నేపధ్యంలో పూర్తి సైలెంట్ అయ్యారు. యరపతినేని అక్రమ మైనింగ్ కేసు లో అక్రమం జరిగిందని సీఐడీ ఇచ్చిన నివేదిక ద్వారా గుర్తించిన ఏపీ ప్రభుత్వం ఆ కేసును సీబీఐకి  గత ఏడాది డిసెంబర్ 24న అప్పగించింది. అప్పటి నుండి ఈ కేసులో సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టింది.

తాజాగా ఈ కేసుకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్స్ ను సిఐడీ నుండి సీబీఐ తీసుకున్నట్టు తెలుస్తుంది . దీంతో మైనింగ్ అక్రమాల కేసులో సీబీఐ వేగం పెంచింది. ఇప్పటికే టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా పలు కేసుల్లో చిక్కుకుంటున్నారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈ ఎస్ఐ స్కాం లో విచారణ ఎదుర్కొంటున్నారు. అలాగే  పితాని సత్యన్నారాయణ కూడా అదే దారిలో ఉన్నాడు . ఇక వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్యకేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఇబ్బంది పడుతున్నారు .ఇక జేసీ బ్రదర్స్ దివాకర్ ట్రావెల్స్ విషయంలో ఫోర్జరీ , నకిలీ పత్రాలు సృష్టించి పలు అక్రమాలు చేసినట్టు కేసులతో జైళ్ళ చుట్టూ , కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ సమయంలో మరోసారి యరపతినేని శ్రీనివాస్ పై అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ వేగంపెంచటం టీడీపీ శ్రేణులకు   టెన్షన్ పెరిగిపోతుంది.

గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే , టీడీపీలో కీలక నేత యరపతినేని అక్రమంగా మైనింగ్ నిర్వహించాడని ఆయన పై గతంలో కేసు నమోదు అయింది. అక్రమంగా మైనింగ్ చేశాడని సీఐడీ నివేదిక ఆధారంగా తేలిందని అప్పట్లో హై కోర్టు వెల్లడించింది. ఈ అక్రమ మైనింగ్ లో వెనకున్న సూత్రధారుల కోసం కూడా విచారణ చేపట్టింది. అందులో భాగంగా ఈ కేసును సమగ్రంగా విచారించటానికి ఏపీ ప్రభుత్వం సీబీఐకి కేసు అప్పగించింది . ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి అక్రమాలు చేసిన గత పాలకులను విడిచిపెట్టేది లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. ఆ కేసులో యరపతినేనితోపాటు 16 మందిపై 18 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తులో సిబీఐ వేగం పెంచింది. చూడాలి మరి సిబిఐ విచారణ లో ఏం తేలుతుందో ..
Tags:    

Similar News