కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆధార్ కార్డ్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. భారత వ్యాపార రంగంలో ఎంతో కీలకంగా ఉన్న పాన్ కార్డు పరిమితిని నామమాత్రం చేస్తూ ఆధార్ కార్డుకు ప్రాధాన్యత ఇచ్చిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో ఐటీ రిటర్న్స్ చెల్లింపులు పాన్ కార్డుతో సంబంధం లేకుండా ఆధార్ కార్డుతో చేయవచ్చని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆధార్ కార్డు మరింత విస్తృత పరిధి కల్పించేలా ఎన్నారైలకు కూడా ఆరునెలల్లోనే ఆధార్ కార్డును జారీ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
ఇదిలా ఉంటే పాన్ కార్డ్ వినియోగదారులకు ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ వచ్చేసింది. వచ్చే నెల 31లోగా పాన్ కార్డును వ్యక్తిగత ఆధార నెంబర్ తో లింక్ చేసుకోపోతే పాన్ కార్డు గుర్తింపు రద్దు అవుతుంది. అంటే పాన్ కార్డు ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకునేందుకు మరో 40 రోజులు మాత్రమే ఉంది. అలా కాని పక్షంలో దేశవ్యాప్తంగా 20 కోట్ల పాన్ కార్డులు అవుతాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 43 కోట్ల మందికి పాన్ కార్డులు ఉంటే... 120 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి.
దేశం మొత్తం మీద ఉన్న పాన్ కార్డుల్లో కేవలం 50 శాతం మాత్రమే ఆధార్ తో లింక్ అయ్యి ఉన్నాయి. ఇక చాలా మంది రుణాలు, క్రెడిట్ కార్డుల కోసం రూల్స్ బ్రేక్ చేసి మరీ పాన్‌కార్డులు వాడుతున్నారు. దీంతో ఆధార్ కు పాన్ కార్డులు అనుసంధానం చేస్తే పాన్ కార్డు ద్వారా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉండదని కేంద్రం భావిస్తోంది. ఆగస్టు 31లోపు ఆధార్ తో అనుసంధానం చేసుకోకపోతే.. సెప్టెంబర్ 1 నుంచి పాన్ కార్డ్ చెల్లదు. ఇక నిర్మలా సీతారామన్ ఇప్పటికే పాన్ కార్డు లేకపోయినా ఆధార్ తో పన్ను చెల్లించుకోవచ్చని ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే.